- మహిళల్లో అత్యధికంగా నమోదవుతోన్న రొమ్ము క్యాన్సర్
- పురుషుల్లో నోరు, పెదవుల క్యాన్సర్ కేసులు ఎక్కువ
- పొగాకు, గుట్కా, ధూమపానం ప్రధాన ప్రమాద కారకాలు
- 40 ఏళ్లు దాటినవారు క్యాన్సర్ ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
- ముదిరిన దశలో క్యాన్సర్ గుర్తిస్తే చికిత్స కష్టమవుతున్న వైనం
క్యాన్సర్ అంటే ఒక్క వ్యాధి కాదు.. శరీరంలోని వేర్వేరు అవయవాలను ప్రభావితం చేసే అనేక రకాల వ్యాధుల సమూహం. వయసు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పొగాకు వినియోగం, పర్యావరణ పరిస్థితులు.. ఇలా ఎన్నో అంశాలు క్యాన్సర్ ముప్పును ప్రభావితం చేస్తాయి. అయితే భారత్‌లో మహిళలు, పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్ రకాలు వేర్వేరుగా ఉండటం గమనార్హం. ముందస్తు గుర్తింపు, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అధికం
అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థకు చెందిన గ్లోబోకాన్ 2022 నివేదిక ప్రకారం.. భారత్‌లో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యధికంగా నమోదవుతోంది. ఆ ఏడాది సుమారు 1,92,020 కొత్త కేసులు వెలుగుచూశాయి. తర్వాతి స్థానాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (1,27,526), అండాశయ క్యాన్సర్ (47,333) ఉన్నాయి. రొమ్ములో గడ్డలు, ఆకృతిలో మార్పులు, చనుమొనల నుంచి అసాధారణ స్రావం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ విషయంలో హెచ్‌పీవీ టీకా, క్రమం తప్పని పరీక్షలు కీలకమని నిపుణులు చెబుతున్నారు.
పురుషుల్లో పొగాకుతో పెరుగుతున్న ముప్పు
పురుషుల్లో పెదవులు, నోటి క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది. గ్లోబోకాన్ గణాంకాల ప్రకారం 2022లో ఈ రకానికి సంబంధించి 1,07,812 కొత్త కేసులు నమోదయ్యాయి. తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ (58,970), అన్నవాహిక క్యాన్సర్ (45,608) ఉన్నాయి. గుట్కా, ఖైనీ, పొగాకు నమలడం నోటి క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. ధూమపానం ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంది. నోటిలో పుండ్లు తగ్గకపోవడం, తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు కనిపించడం, మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
40 ఏళ్లు దాటితే మరింత అప్రమత్తత
క్యాన్సర్ ఏ వయసులోనైనా రావచ్చు. అయితే 40 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ కణాల్లో జన్యుపరమైన మార్పులు పేరుకుపోవడం ఒక కారణం. పొగాకు, వాయు కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం కూడా ముప్పును పెంచుతాయి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం, ఊబకాయం వంటి అంశాలు కొన్ని జీర్ణవ్యవస్థ క్యాన్సర్ల ప్రమాదంతో ముడిపడి ఉండవచ్చు.
ఆలస్యంగా గుర్తిస్తే చికిత్స కష్టమే
క్యాన్సర్ విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వైద్య సదుపాయాల వ్యత్యాసం కూడా ప్రభావం చూపుతోంది. ప్రత్యేక పరీక్షలు, చికిత్సా కేంద్రాలు ప్రధానంగా నగరాల్లోనే ఉండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణ ఖర్చులు, చికిత్స వ్యయం, అవగాహన లోపం కారణంగా పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. 70 శాతానికి పైగా కేసులు ముదిరిన దశలోనే బయటపడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో ముందస్తు జాగ్రత్తలే కీలకం. పొగాకుకు దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. వయసు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్యుల సూచనతో తగిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. మహిళలు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై అవగాహన పెంచుకోవాలి. హెచ్‌పీవీ టీకా కూడా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో ఉపయోగపడుతుంది. లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా, ప్రమాద కారకాలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. క్యాన్సర్ వచ్చిన తర్వాత పోరాడటం కంటే.. రాకుండా జాగ్రత్తపడటం, వస్తే తొలిదశలో గుర్తించడం ఎంతో ముఖ్యం.