- విశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
- 58 దేశాల నుంచి హాజరుకానున్న ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు
- ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సదస్సుకు ముందే రూ.86,522 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
- ఏపీ సంస్కృతి, వనరులను ప్రతిబింబించేలా భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న 31వ సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. 'నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్' అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఎల్లుండి జరిగే జరిగే ముగింపు కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హాజరవుతారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రతినిధులు విశాఖకు తరలివస్తున్నారు. వీరిలో 16 మంది విదేశీ మంత్రులు, 40 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఉండటం గమనార్హం.
ఆరు కీలక అంశాలపై మేధోమధనం
రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో ఆరు కీలక అంశాలపై ప్రత్యేకంగా చర్చలు జరగనున్నాయి.
1. వాణిజ్యం – పెట్టుబడులు – గ్లోబల్ వాల్యూ చైన్స్: ప్రపంచ వాణిజ్యంలో ఏపీ పాత్ర, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి.
2. ట్రస్ట్ – జియో ఎకనమిక్స్ – గ్లోబల్ కో ఆపరేషన్: భౌగోళిక, ఆర్థిక సహకారం ద్వారా నమ్మకాన్ని పెంపొందించడం.
3. వ్యవసాయం – ఆహార భద్రత – జీవ ఆధారిత ఆర్థిక వ్యవస్థ: వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, ఆహార భద్రత.
4. ప్రతిభ – నైపుణ్యాలు – అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు: యువతకు నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి ఉద్యోగాలు.
5. సాంకేతికత – ఆవిష్కరణలు – భవిష్యత్ పరిశ్రమలు: టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి.
6. స్వచ్ఛ ఇంధనం - సుస్థిర వృద్ధి: పర్యావరణహిత ఇంధన వనరులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు.
ఈ అంశాలపై జరిగే మేధోమధనం ద్వారా ప్రపంచ ఆర్థిక మార్పులకు అనుగుణంగా ఏపీ పారిశ్రామిక రంగానికి కొత్త దిశానిర్దేశం చేయనున్నారు.
సమాంతరంగా మహిళా సదస్సు, భారీగా ఒప్పందాలు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సమాంతరంగా 'ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్–2026'ను కూడా నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, పారిశ్రామిక రంగంలో వారి భాగస్వామ్యం, ఆర్థిక వృద్ధిపై ఇందులో ప్రత్యేకంగా చర్చిస్తారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం కల్పించడంపై దృష్టి సారిస్తారు. ఇప్పటికే ఈ సదస్సుకు సన్నాహకంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశాల ద్వారా రూ.86,522 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడం విశేషం. ప్రధాన సదస్సులో భాగంగా సుమారు 400కు పైగా బిజినెస్ టు బిజినెస్ (B2B), బిజినెస్ టు గవర్నమెంట్ (B2G) సమావేశాలు జరగనున్నాయి.
ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశాలు, సాంస్కృతిక వైభవం
సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు, విదేశీ ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ముందుగానే (బుధవారం) విశాఖకు చేరుకోనున్నారు. అంతకుముందు అమరావతిలో సింగపూర్ ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు.
విశాఖకు వచ్చే అతిథులకు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యం ఉట్టిపడేలా ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గిరిజన థింసా నృత్యం, గరగ, తప్పెటగుళ్ళు వంటి జానపద కళారూపాలతో పాటు ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలాట, కూచిపూడి వంటి కళలను ప్రదర్శించనున్నారు.
రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన పంటలు, అరకు కాఫీ, పర్యాటకం, లాజిస్టిక్స్, సౌరశక్తి వంటి రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను చాటిచెప్పేలా ప్రత్యేక స్టాళ్లను, కళాకృతులను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక దిగ్గజాలు, సీఈఓలు ముఖ్యమంత్రితో చర్చలు జరిపేందుకు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వేర్వేరుగా ప్రత్యేక సమావేశ మందిరాలను సిద్ధం చేశారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.