- పాత గొడవపై పగతో రెండు నెలలుగా ప్లాన్ చేసిన నిందితుడు
- హత్య చేసేందుకు ఆన్‌లైన్‌లో కత్తి కొనుగోలు చేసిన వైనం
- హత్య తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన ఇమ్రాన్
- నిందితుడిపై గతంలోనే రెండు హత్య కేసులు ఉన్నట్టు గుర్తింపు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాత గొడవను మనసులో పెట్టుకుని ఓ యువకుడు తన స్నేహితుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇందుకోసం రెండు నెలల క్రితమే ఆన్‌లైన్‌లో కత్తి కొనుగోలు చేసి, ప్రణాళిక ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ షౌకత్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ పాషా (24), ఫర్హాన్ (28) స్నేహితులు. ఇద్దరూ తరచూ కలిసి మద్యం సేవించేవారు. చిన్నచిన్న నేరాలకు కూడా పాల్పడేవారని పోలీసులు తెలిపారు. సుమారు రెండు నెలల క్రితం మద్యం మత్తులో వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా, ఫర్హాన్ ఇమ్రాన్‌పై దాడి చేశాడు. అప్పటి నుంచి ఫర్హాన్‌పై పగ పెంచుకున్న ఇమ్రాన్, అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఒక కత్తిని కొనుగోలు చేసి, గత రెండు నెలలుగా ఫర్హాన్ కదలికలను గమనిస్తున్నాడు. ఈ నెల 8న ఫర్హాన్ సాగర్ సొసైటీ జంక్షన్ సమీపంలోని ఓ ఫైర్ క్రాకర్ షాపు వద్ద ఉన్నాడని తెలుసుకున్న ఇమ్రాన్, అక్కడికి చేరుకుని మాటువేశాడు. ఫర్హాన్‌పై అకస్మాత్తుగా దాడి చేసి వెనుక నుంచి కత్తితో పొడవటంతో తీవ్ర గాయాలపాలై అతను అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య చేసిన అనంతరం ఇమ్రాన్ స్వయంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
దర్యాప్తులో నిందితుడు ఇమ్రాన్‌పై గతంలోనే అల్వాల్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు హత్య కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.