- ఫిలిప్పీన్స్‌లో జరిగిన టోర్నమెంట్ గెలిచి రికార్డు
- మధ్యప్రదేశ్ నుంచి గ్రాండ్‌మాస్టర్ అయిన తొలి ఆటగాడిగా రికార్డు
- ప్రత్యేక నిబంధనల కింద నేరుగా టైటిల్ కైవసం
- చదరంగంలో చారిత్రక మైలురాయిని అందుకున్న భారత్
భారత చదరంగం చారిత్రక మైలురాయిని అందుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల అనుజ్ శ్రీవత్రి దేశ 100వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. ఫిలిప్పీన్స్‌లో ఆదివారం ముగిసిన 7వ ఏషియన్ ప్లస్ ఇండివిడ్యువల్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి ఆయన ఈ ఘనత సాధించాడు. ఈ విజయంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన తొలి ఆటగాడిగా కూడా ఆయన రికార్డు సృష్టించాడు.
ఈ టోర్నమెంట్‌లో విజేతకు నేరుగా గ్రాండ్‌మాస్టర్ టైటిల్ ఇచ్చేందుకు ఫిడే (అంతర్జాతీయ చెస్ సమాఖ్య) ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది. దీంతో మూడు జీఎం నార్మ్‌లు, 2500 ఎలో రేటింగ్ వంటి సాధారణ నిబంధనల అవసరం లేకుండానే అనుజ్ ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన అనుజ్.. తొలి గేమ్‌లో ఓడిపోయినా అద్భుతంగా పుంజుకున్నాడు. మొత్తం 9 గేమ్‌లలో 7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.
1988లో విశ్వనాథన్ ఆనంద్ దేశ తొలి గ్రాండ్‌మాస్టర్‌గా నిలవగా, 100వ గ్రాండ్‌మాస్టర్ మైలురాయిని చేరడానికి సుమారు 38 ఏళ్లు పట్టింది. ముఖ్యంగా 2010 తర్వాత దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కట్నీకి చెందిన అనుజ్ 2019 నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్‌గా ఉన్నాడు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన అనుజ్.. చెస్‌పై దృష్టి పెట్టేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాడు.
అనుజ్ చారిత్రక విజయం పట్ల అఖిల భారత చెస్ సమాఖ్య అధ్యక్షుడు నితిన్ నారంగ్, దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ అభినందనలు తెలిపారు. దీపావళి పండుగ వేళ ఈ ఘనత సాధించడంపై ఆనంద్ స్పందిస్తూ 'ఇది క్రాకర్ లాంటి 100' అని వ్యాఖ్యానించారు.