- ఐపీఎల్ విండోను మార్చాలని సూచించిన లలిత్ మోదీ
- టోర్నీ నిర్వహణకు ఐసీసీ అనుమతి అవసరం లేదని స్పష్టీకరణ
- వేసవి ఎండల నుంచి తప్పించేందుకు జనవరి లేదా అక్టోబర్-ఏప్రిల్ విండో ప్రతిపాదన
- ఛాంపియన్స్ లీగ్ టీ20 పునరుద్ధరణ ఆలోచనను వ్యతిరేకించిన మోదీ
- క్రికెట్‌లో ఐపీఎల్.. ఫుట్‌బాల్‌లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లాంటిదని వ్యాఖ్య
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణపై మరోసారి తనదైన శైలిలో సంచలన ప్రతిపాదనలు చేశాడు. ప్రస్తుతం మార్చి-ఏప్రిల్ నెలల్లో జరుగుతున్న ఐపీఎల్‌ను, తీవ్రమైన వేసవి నుంచి తప్పించి జనవరిలో లేదా అక్టోబర్-ఏప్రిల్ మధ్య సుదీర్ఘ విండోలో నిర్వహించాలని సూచించాడు. ఐపీఎల్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే ఒక పెద్ద శక్తి అని, దాని ఎదుగుదలను కొనసాగించాలంటే సొంతంగా ఒక విండోను సృష్టించుకోగల సత్తా దానికి ఉందని మోదీ అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. "ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ గురించి చాలామందికి ప్రాథమిక అవగాహన లోపించింది. ఐపీఎల్ నిర్వహణకు ఐసీసీ ప్రత్యేకంగా విండో కేటాయించాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ అనేది బీసీసీఐ యాజమాన్యంలో నడిచే ఒక దేశీయ టోర్నమెంట్. దానిని ఎప్పుడు నిర్వహించాలనేది బీసీసీఐ నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ సిరీస్‌లు, ఆటగాళ్ల లభ్యత వంటివి నిర్వహించుకోవాలే తప్ప, క్యాలెండర్‌లో చోటు కోసం అనుమతి అడగాల్సిన పనిలేదు" అని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ శక్తిని వివరిస్తూ.. "ప్రారంభంలో ఐపీఎల్‌తో పోటీ పడతామని బాలీవుడ్ పరిశ్రమ భావించింది. కానీ, ఐపీఎల్ దేశం దృష్టిని ఆకర్షించినప్పుడు ఏం జరుగుతుందో వారు త్వరగానే తెలుసుకున్నారు. సినిమా రిలీజ్‌లు వాయిదా పడ్డాయి, ప్రైమ్ టైమ్ టీవీ కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. ఐపీఎల్ ఎప్పుడూ బాలీవుడ్‌ను విండో అడగలేదు, బాలీవుడ్డే ఐపీఎల్‌కు అనుగుణంగా సర్దుకుపోయింది" అని మోదీ గుర్తుచేశాడు.
ఫుట్‌బాల్‌లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)కు ఎలాంటి ప్రాముఖ్యత ఉందో, క్రికెట్‌లో ఐపీఎల్‌కు అలాంటి స్థానం ఉందని ఆయన పోల్చారు. "ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లకు ఆర్థిక అవకాశాలు ఎక్కడున్నాయో బాగా తెలుసు. ఒక ఐపీఎల్ కాంట్రాక్ట్ వారి వార్షిక సంపాదనలో గణనీయమైన వాటాను అందిస్తుంది. ఈ ఆర్థిక వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు" పేర్కొన్నాడు.
అదే సమయంలో గతంలో నిలిచిపోయిన ఛాంపియన్స్ లీగ్ టీ20 పునరుద్ధరణ ఆలోచనను తాను సమర్థించడం లేదని మోదీ స్పష్టం చేశాడు. "ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులే ఇతర దేశాల లీగ్‌లలోనూ జట్లను కొనుగోలు చేశారు. ఒకే యాజమాన్యం కింద ఉన్న జట్లు ఒకదానికొకటి పోటీ పడటం వల్ల 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న ఐపీఎల్‌ను మరింత బలోపేతం చేయాలి కానీ, మరో టోర్నమెంట్ అవసరం లేదు" అని వివరించాడు.
"తీవ్రమైన ఏప్రిల్-మే ఎండల నుంచి ఐపీఎల్‌ను తప్పించి, మెరుగైన వాతావరణంలో నిర్వహించాలి. దీనివల్ల ఆటగాళ్లకు సౌకర్యంగా ఉండటమే కాకుండా బ్రాడ్‌కాస్టర్లకు, స్పాన్సర్లకు మరింత విలువ చేకూరుతుంది. ఈ ఆర్థిక వాస్తవాన్ని ఐసీసీ, ఇతర క్రికెట్ బోర్డులు గుర్తించి, ఐపీఎల్‌కు అనుగుణంగా తమ ప్రణాళికలను మార్చుకోవాలి. నిన్నటి ఆర్థిక సూత్రాలతో రేపటి క్రికెట్‌ను నడపలేరు. ఐపీఎల్ మార్కెట్‌ను అనుసరించడానికి పుట్టలేదు, మార్కెట్‌ను మార్చడానికే పుట్టింది" అని మోదీ చెప్పుకొచ్చాడు.