- రాజాంలో టపాసుల వల్ల దగ్ధమైన ఆటోమొబైల్ షోరూం
- గన్నవరం, తిరువూరులోనూ అగ్నికి ఆహుతైన దుకాణాలు
- తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. విజయనగరం జిల్లా రాజాంతో పాటు కృష్ణా జిల్లా గన్నవరం, తిరువూరులలో చోటుచేసుకున్న ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
విజయనగరం జిల్లా రాజాంలోని ఒక ఆటోమొబైల్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి టపాసులు ప్రమాదవశాత్తు షోరూమ్‌పై పడటంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో షోరూమ్ పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అదేవిధంగా, కృష్ణా జిల్లా గన్నవరంలో బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిరిపడి ఒక ఫర్నిచర్ దుకాణానికి మంటలు అంటుకున్నాయి. తిరువూరులోని మరో దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి దుకాణం పూర్తిగా దెబ్బతింది. ఈ మూడు ఘటనల్లోనూ భారీగా ఆస్తి నష్టం జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.