- మరో 32 మందికి కంటి గాయాలు
- గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు
- గతంతో పోలిస్తే ఈసారి కేసులు తగ్గాయన్న వైద్యులు
దీపావళి పండుగ హైదరాబాద్లోని కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. టపాసులు కాలుస్తున్నప్పుడు అజాగ్రత్తగా వ్యవహరించడం, ప్రమాదాలు జరగడంతో 32 మంది కంటి గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఒకరు కుడి కంటి చూపును శాశ్వతంగా కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలన్నీ ఆదివారం నగరంలోని మెహిదీపట్నంలో ఉన్న ప్రభుత్వ సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో నమోదయ్యాయి.
దీపావళి వేడుకల సందర్భంగా టపాసుల కారణంగా గాయపడిన 32 మంది చికిత్స కోసం సరోజినీ దేవి ఆసుపత్రికి వచ్చారు. వీరిలో గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న ఆరుగురిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మిగిలిన 26 మందికి ప్రాథమిక చికిత్స అందించి, మందులు ఇచ్చి పంపించారు. వారిని తదుపరి పరీక్షల కోసం మళ్లీ రావాలని వైద్యులు సూచించారు.
దీపావళి సందర్భంగా ఇలాంటి కేసులు అధిక సంఖ్యలో వస్తాయని ముందే ఊహించిన ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 550 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిలో 20 బెడ్లను ప్రత్యేకంగా టపాసుల బాధితుల కోసం కేటాయించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో పాటు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు. అత్యవసర కేసులను హైదరాబాద్కు తరలించేందుకు జిల్లాల్లోనూ అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. మోదిని మాట్లాడుతూ.. గత రెండేళ్ల దీపావళి సీజన్లలో 116, 115 చొప్పున కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. టపాసుల విషయంలో అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన గాయాలు, శాశ్వత అంధత్వం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు ముందుగానే హెచ్చరించారు. అయినప్పటికీ ప్రమాదాలు జరగడం విచారకరం. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు, బాటసారులు ఉండటం గమనార్హం.