- ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోత, రియల్ ఎస్టేట్ సంక్షోభమే ప్రధాన కారణాలు
- విపరీతంగా పెరిగిన మొండి బకాయిల మార్కెట్
- రుణ వసూళ్లపై కొత్త నిబంధనలతో రుణగ్రహీతలు, కలెక్టర్లపై తీవ్ర ఒత్తిడి
- అధికారిక లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య భారీ వ్యత్యాసం
చైనాలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడటంతో సుమారు 10 కోట్ల మంది వినియోగదారులు తాము తీసుకున్న వ్యక్తిగత రుణాలను తిరిగి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లూమ్బర్గ్ బిజినెస్వీక్ నివేదిక ప్రకారం ఉద్యోగాలు కోల్పోవడం, రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడం, కరోనా మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాల వల్ల చైనాలో కుటుంబాల ఆర్థిక పరిస్థితి బలహీనపడింది. గేవికల్ డ్రాగనోమిక్స్ అనే సంస్థ అంచనాల ప్రకారం ఈ సంఖ్య భారీ స్థాయిలో ఉంది.
రాయునియన్ క్రెడిట్ ప్లాట్ఫామ్ డేటా ప్రకారం.. చెల్లించని వినియోగదారుల రుణాల మార్కెట్ చైనాలో భారీగా విస్తరించింది. 2021లో బ్యాంకులు సుమారు 18.6 బిలియన్ యువాన్ల మొండి బకాయిలను బదిలీ చేయగా, 2025 చివరి నాటికి ఈ మొత్తం 20 రెట్లు పెరిగి దాదాపు 454 బిలియన్ యువాన్లకు చేరింది. ఇవి ఎక్కువగా క్రెడిట్ కార్డ్ బకాయిలు, వ్యక్తిగత రుణాలు వంటి అసురక్షిత రుణాలే కావడం గమనార్హం. గృహ, వాహన రుణాలు ఇందులో భాగం కాదు.
వుహాన్కు చెందిన 23 ఏళ్ల ర్యాన్ హు వంటి డెట్ కలెక్టర్లు రోజంతా రుణగ్రహీతలకు ఫోన్లు చేస్తూనే ఉన్నామని చెబుతున్నారు. వీరిలో కరోనా తర్వాత వ్యాపారాలు కోలుకోని రెస్టారెంట్ యజమానులు, రియల్ ఎస్టేట్ ఉద్యోగాలు కోల్పోయిన జంటలు, కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని యువ గ్రాడ్యుయేట్లు ఉన్నారని వారు వివరిస్తున్నారు.
అధికారిక బ్యాంకింగ్ లెక్కల ప్రకారం చైనాలో గృహ రుణాల ఎగవేత రేటు 3 శాతం కంటే తక్కువగానే ఉంది. ఇది అమెరికా కంటే మెరుగైనప్పటికీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. చాలా మంది రీఫైనాన్సింగ్ ద్వారా లేదా కుటుంబ సభ్యుల సహాయంతో వాయిదాలు చెల్లిస్తుండటం, దేశవ్యాప్తంగా వ్యక్తిగత దివాలా చట్టం లేకపోవడం వంటి కారణాలతో అసలు సమస్య బయటకు రావడం లేదని వారు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది చైనా ప్రభుత్వం రుణ వసూళ్లపై కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టింది. దీంతో దూకుడుగా సాగే వసూళ్ల పద్ధతులు తగ్గాయి, రికవరీ రేట్లు మందగించాయి. మరోవైపు ఆన్లైన్ రుణాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం పరిమితం చేయడంతో రుణగ్రహీతులకు కొత్త అప్పులు పుట్టడం కష్టంగా మారింది.