వైసీపీకి మరో షాక్.. గంటా సమక్షంలో టీడీపీలోకి 200 కుటుంబాల చేరిక
- విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీకి ఎదురుదెబ్బ
- సీఎం చంద్రబాబు పాలన వల్లే ప్రజలు వస్తున్నారన్న గంటా
- రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కూటమిదే విజయమని ధీమా
విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సుమారు 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆనందపురం మండలం సొంఠ్యాం గ్రామానికి చెందిన ఈ కుటుంబాలు టీడీపీలో చేరడం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా అధికార కూటమిలో చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాలన, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఈ చేరికలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లోనైనా కూటమిదే విజయమని గంటా ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవలే భీమిలి నియోజకవర్గానికి వైసీపీ కొత్త సమన్వయకర్తగా బొత్స అనూష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈ భారీ చేరికలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయని, ఇది ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇస్తున్న మద్దతును సూచిస్తోందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.