- ఫోన్ దొంగతనంపై ఫిర్యాదు చేశారనే కోపంతో దారుణం
- నిందితుడు 19 ఏళ్ల కేశావత్ శివశంకర్ అరెస్ట్
- అతడి నుంచి సెల్‌ఫోన్, హత్యకు వాడిన కత్తి స్వాధీనం
- నిందితుడిపై గతంలో ఏపీలోనూ దొంగతనం కేసులు ఉన్నట్లు గుర్తింపు
తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కక్షతో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన 19 ఏళ్ల యువకుడిని చేవెళ్ల పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్ దొంగతనంతో పాటు బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ చేసిన వ్యవహారం ఈ హత్యకు దారితీసింది. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన మొబైల్ ఫోన్‌తో పాటు, హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన కేశావత్ శివ శంకర్ వరప్రసాద్ నాయక్ (19), బాతుల గురువులు అనే వ్యక్తి సెల్‌ఫోన్ దొంగిలించాడు. అనంతరం బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 45,000 నగదును తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన గురువులు, పద్మ అనే మహిళతో కలిసి ఈ నెల 21న చేవెళ్ల పోలీసులకు శివపై ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసే సమయంలో పద్మ కూడా ఉండటంతో శివ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరా కాలేజీ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డు వద్ద పద్మపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో కేవలం 24 గంటల్లోనే నిందితుడు శివను పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని వెలుగోడు పోలీస్ స్టేషన్లో రెండు దొంగతనం కేసులు నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.