పుట్టిన 28 రోజులకే ఇన్వెస్టర్.. జెరోధాలో సరికొత్త రికార్డ్!
- జెరోధాలో 28 రోజుల పసికందు ఇన్వెస్టర్‌గా మారినట్లు నితిన్ కామత్ వెల్లడి
- గతేడాది 64 రోజుల శిశువు పేరిట ఉన్న రికార్డు ఈసారి బద్దలు
- పిల్లల కోసం పుట్టిన వెంటనే మైనర్ అకౌంట్లు తెరుస్తున్న పేరెంట్స్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్
- ఇంత చిన్న వయసులో పాన్, ఆధార్ ఎలా సాధ్యమని నెటిజన్ల ఆశ్చర్యం
షేర్ మార్కెట్ పెట్టుబడులు పెద్దలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇప్పుడు పుట్టిన పసికందులు కూడా ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధాలో కేవలం 28 రోజుల వయసున్న ఓ శిశువు ఇప్పుడు అతి పిన్న వయసు కస్టమర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ ఆసక్తికర విషయాన్ని జెరోధా సీఈఓ నితిన్ కామత్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. "మా అతి చిన్న వయసు కస్టమర్ వయసు కేవలం 28 రోజులు. ఈ పసికందు తల్లిదండ్రులు మైనర్ అకౌంట్ తెరిచి, వారం రోజుల్లోనే మొదటి పెట్టుబడి పెట్టారు" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సరిగ్గా ఏడాది క్రితం కూడా నితిన్ కామత్ ఇలాంటి ఓ మైలురాయిని పంచుకున్నారు.
అప్పుడు 64 రోజుల శిశువు జెరోధాలో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అయితే, ఏడాది తిరిగేసరికి ఈ రికార్డు దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. దీన్నిబట్టి, పిల్లలు పెద్దయ్యాక కాకుండా పుట్టిన వెంటనే వారి పేరిట పెట్టుబడులు ప్రారంభించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని స్పష్టమవుతోంది.
నితిన్ కామత్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు పది లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. కామెంట్ల సెక్షన్‌లో దీనిపై పెద్ద చర్చే జరిగింది. "కేవలం 28 రోజుల శిశువుకు ఇంత త్వరగా పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎలా వచ్చాయి? మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?" అని ఓ యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి మరో నెటిజన్ స్పందిస్తూ, "ఇప్పుడు పిల్లలకు కూడా కొన్ని రోజుల్లోనే ఆధార్, పాన్ కార్డులు వస్తున్నాయి" అని సమాధానమిచ్చారు.
మరికొందరు ఈ విషయంపై సరదాగా స్పందించారు. "ఆ పసికందు ఇప్పటికే 27 రోజుల కాంపౌండింగ్ అవకాశాన్ని కోల్పోయింది. తల్లిదండ్రులు ఇంకాస్త బాధ్యతగా ఉండాల్సింది" అని ఓ యూజర్ చమత్కరించారు.
"మేము బేబీ కోసం ప్లాన్ చేయడానికి ముందే అకౌంట్ తెరవొచ్చా? ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని తెలియగానే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా" అని మరో యూజర్ సరదాగా రాసుకొచ్చారు.
మొత్తం మీద ఈ ఘటన మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల ఆర్థిక భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పును స్పష్టంగా సూచిస్తోంది.