- భార్యతో గొడవపడి నోట్ల కట్టలకు నిప్పుపెట్టిన భర్త
- జైపూర్‌లో వెలుగు చూసిన విచిత్ర ఘటన
- రూ.22 వేల సూట్ కొనుగోలు చేయడమే వివాదానికి కారణం
- సొంతింటి కోసం దాచుకున్న డబ్బును కాల్చేసిన వ్యక్తి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
భార్యతో జరిగిన ఓ చిన్న గొడవ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. క్షణికావేశంలో ఓ వ్యక్తి కష్టపడి దాచుకున్న డబ్బుకు నిప్పుపెట్టాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి దాచిన సొమ్మును బూడిదపాలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన మంజీత్ ధాకడ్ అనే వ్యక్తి భార్య, అతని కోసం రూ.22 వేలతో ఓ ఖరీదైన సూట్ కొనుగోలు చేసింది. అయితే, సొంత ఇంటి నిర్మాణం కోసం డబ్బు కూడబెడుతుంటే ఇంత ఖరీదైన సూట్ కొనడం అవసరమా? అని మంజీత్ భార్యను నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
వివాదం పెద్దదవడంతో మనస్తాపానికి గురైన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన మంజీత్, గొడవలన్నింటికీ డబ్బే కారణమని భావించాడు. వెంటనే బ్యాంకులో ఉన్న డబ్బునంతా విత్‌డ్రా చేసి, రూ.500 నోట్ల కట్టలకు నిప్పుపెట్టాడు. ఈ దృశ్యాలను అతనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.