పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఇంద్రకీలాద్రిపై ప్రధాని మోదీ పేరిట పూజలు
- మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం
- పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఎంపీ లింగమనేని రమేశ్ పూజల నిర్వహణ
- అమ్మవారికి విశిష్టమైన ఖడ్గమాల అర్చన జరపనున్న ఎంపీ
- ప్రధానికి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 7వ తేదీన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ పేరిట ఈ పూజా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ ఈ పూజలను నిర్వహిస్తున్నారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ ప్రజా ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచి 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, 25 ఏళ్లుగా తన సేవలను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని, ప్రధాని మోదీకి అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని, ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు జరపనున్నారు. దేశాన్ని 'వికసిత్ భారత్' లక్ష్యం వైపు నడిపిస్తున్న ఆయన నాయకత్వం మరింత బలోపేతం కావాలన్నది ఈ పూజల ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి అంతరాలయంలో అత్యంత విశిష్టమైన 'ఖడ్గమాల అర్చన'ను ప్రధాని పేరిట జరపనున్నారు. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టించిన శ్రీచక్రానికి ఖడ్గమాల స్తోత్రంతో పూజలు నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆధ్యాత్మిక శక్తి, రక్షణ, శాంతి, సంకల్పసిద్ధి కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ప్రధాని మోదీ నిరంతర దేశ సేవకు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయన నాయకత్వంలో భారతదేశం మరింత సుసంపన్నమైన, ఆత్మనిర్భర దేశంగా ఎదగాలన్న సంకల్పంతో ఎంపీ లింగమనేని రమేశ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పూజల ద్వారా ప్రధానికి సంపూర్ణ ఆరోగ్యం, శక్తి సామర్థ్యాలు లభించాలని ఆకాంక్షించారు.