వచ్చే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్ కలిసి ఉంటారా?: జీవన్ రెడ్డి
- వచ్చే ఎన్నికల వరకు రేవంత్, మహేష్ కలిసి ఉంటారా అని జీవన్ రెడ్డి ప్రశ్న
- వీళ్ల జోడీ మళ్లీ అధికారంలోకి వస్తుందని గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా
- మల్కాజ్ గిరి ఎంపీ స్థానంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలవలేదని వ్యాఖ్య
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ జోడీ ఉంటుందా? అని సూటిగా ప్రశ్నించారు.
వీరి జోడీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వీళ్లు గొప్పగా చెప్పుకుంటున్నారని... వీళ్లు ఎన్ని రోజులు కలిసుంటారో వీళ్లకే తెలియదని ఎద్దేవా చేశారు. ఈయన పీసీసీ ప్రెసిడెంట్ గా ఉంటాడో లేదో ఆయనకు తెలియదని... ఆయన సీఎంగా ఉంటాడో లేదో ఈయనకు తెలియదని అన్నారు. మీ జోడీ, మీ పేర్లు చూసి జనాలు ఓట్లు వేసినట్టయితే... 2023 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలో 7 నియోజకవర్గాలుంటే ఒక్కటైనా గెలిచావా రేవంత్ రెడ్డీ? అని ప్రశ్నించారు..