తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి.. లేదంటే హైదరాబాద్‌ తగలబడిపోతుంది: దానం నాగేందర్‌

తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి.. లేదంటే హైదరాబాద్‌ తగలబడిపోతుంది: దానం నాగేందర్‌

Danam Nagender threatens to burn Election Commission office over vote deletion
  • హిమాయత్‌నగర్‌లో 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపణ
  • బీజేపీతో ఈసీ కుమ్మక్కైందంటూ దానం విమర్శలు
  • తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్‌
  • ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక
నగరంలో ఓట్ల తొలగింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ అంశంపై మాజీ మంత్రి దానం నాగేందర్‌ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌ మొత్తం తగలబడిపోతుందని వ్యాఖ్యానించారు. హిమాయత్‌నగర్‌ డివిజన్‌లో సీసీ రోడ్ల పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల సంఘం అధికారులు బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తున్నారని దానం నాగేందర్‌ ఆరోపించారు. హిమాయత్‌నగర్‌ డివిజన్‌లోనే సుమారు 20 వేల ఓట్లను ఏకపక్షంగా తొలగించారని పేర్కొన్నారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నాయకులు వ్యవస్థీకృతంగా ‘ఓట్‌ చోరీ’కి పాల్పడుతున్నారని విమర్శించారు. స్థానికంగా ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

తన నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడే బాధ్యత తనపై ఉందని దానం నాగేందర్‌ తెలిపారు. తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. ఈసీ స్పందించకపోతే నిరసనలు, ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Advertisement
Danam Nagender
Election Commission
Vote Deletion Hyderabad
BJP Vote Theft Allegations
Himayatnagar Voter List
Telangana Political News

More Telugu News