ఉజ్జయిని ఘర్షణలకు ఏఐ వీడియోలే కారణమా? మసీదు కూల్చివేతపై పోలీసుల వివరణ
- ఉజ్జయిని ఘర్షణలకు ఏఐ వీడియోలే కారణమన్న పోలీసులు
- మసీదు కూల్చివేతపై తప్పుడు వీడియోల ప్రచారం జరిగిందని వివరణ
- మూడు స్టేషన్లలో ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
- 20 మందిపై కేసులు.. 15 మంది అదుపులోకి
- రోడ్డు విస్తరణలో మసీదులో కొంత భాగం తొలగింపు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహీ మసీదు విషయంలో జరిగిన ఘర్షణలకు కృత్రిమ మేధతో రూపొందించిన తప్పుడు వీడియోలు ఆజ్యం పోశాయని పోలీసులు తెలిపారు. మసీదు మొత్తాన్ని కూల్చివేస్తున్నట్లు చూపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆ తర్వాత పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
2028 సింహస్థ కుంభమేళా నేపథ్యంలో ఉజ్జయినిలో రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాంతల్ క్రాసింగ్ నుంచి గోపాల్ మందిర్ వరకు రోడ్డును 15 మీటర్లకు విస్తరించనున్నారు. ఈ మార్గంలోకి వస్తున్న షాహీ మసీదు కొంత భాగాన్ని తొలగించాల్సి ఉంది. అయితే మసీదు మొత్తాన్ని కూల్చేస్తున్నట్లు చూపించే ఏఐ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగిందని పోలీసులు చెబుతున్నారు.
వీడియోలు, రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు ఆరోపిస్తూ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మొత్తం 20 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఐదుగురు కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరికొందరిని అరెస్టు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రాళ్ల దాడికి పాల్పడిన వారిని గుర్తిస్తున్నామని ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు.
రోడ్డు విస్తరణకు ముస్లిం సమాజం సహకరిస్తోందని మసీదుకు సంబంధించిన నుమాయిందా కమిటీ సభ్యుడు ఫహీమ్ సికందర్ తెలిపారు. తొలగించాల్సిన భాగాన్ని తామే తొలగించడం ప్రారంభించామని చెప్పారు. తొలగించాల్సిన విస్తీర్ణంపై మొదట భిన్నాభిప్రాయాలు ఉన్నా.. చివరకు సుమారు మూడు అడుగుల మేర తొలగించేందుకు అంగీకారం కుదిరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మధ్యప్రదేశ్ హైకోర్టులోనూ ఈ వ్యవహారంపై రెండు అప్పీళ్లను సోమవారం పరిష్కరించారు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్‌తో అంగీకారం కుదిరిందని ముస్లిం వర్గం కోర్టుకు తెలిపింది. మసీదు తొలగింపు ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచి కొనసాగనుంది. ఈ పనులకు ఏడు నుంచి ఎనిమిది రోజులు పట్టే అవకాశం ఉందని మసీదు కమిటీ తెలిపింది.