పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. రూ.3,160 పతనమైన బంగారం

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. రూ.3,160 పతనమైన బంగారం

Good news for gold lovers Gold price drops by 3160 rupees
  • అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో తగ్గుదల
  • హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,680
  • కిలో వెండి ధర రూ.2.50 లక్షలకు చేరిక
దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు గత వారం రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.3,160 మేర తగ్గుదల నమోదైంది. పసిడితో పాటు వెండి ధరలు సైతం ఇదే బాటలో పయనిస్తున్నాయి.

అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బలపడటంతో పాటు, యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడి పెరగడం వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారం నుంచి వైదొలుగుతున్నారు. దీనికి తోడు దేశీయంగానూ డిమాండ్ కొంత మందగించడంతో ధరలు దిగివచ్చాయి.

ఆదివారం ఉదయం నాటికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,680గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,14,510గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వంటి ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. 
Advertisement
Gold Price
Gold Rate Today
Hyderabad Gold Rates
Silver Price India
Gold Price Drop
24 Carat Gold Rate

More Telugu News