పెరిగిన పీఎఫ్ వేతన పరిమితి.. మీ శాలరీ, పొదుపుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- పీఎఫ్ వేతన పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు
- ఉద్యోగి పీఎఫ్ వాటా రూ.3,000 వరకు పెరిగే ఛాన్స్
- సంస్థ వాటా కూడా రూ.3,000 వరకు పెరిగే అవకాశం
- ఈపీఎస్ వాటా రూ.2,083 వరకు పెరిగే అవకాశం
- అదనపు పొదుపుతో రిటైర్మెంట్ నిధి పెరగొచ్చు
నెల జీతం వస్తుంది.. ఖర్చులు పోతాయి.. మిగిలిన దాంట్లో కొంత పీఎఫ్‌లోకి వెళుతుంది. ఉద్యోగ జీవితంలో పెద్దగా పట్టించుకోని ఈ చిన్న మొత్తం.. రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంగా మారుతుంది. ఇప్పుడు పీఎఫ్ లెక్కల్లో కీలక మార్పు వచ్చింది. వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచడంతో ఉద్యోగుల నెలవారీ పొదుపు పెరగనుంది. మరి ఈ మార్పుతో మీ జీతం నుంచి ఎంత పీఎఫ్ కట్ అవుతుంది? సంస్థ ఎంత జమ చేస్తుంది? పెన్షన్‌పై ప్రభావం ఏంటి?
అసలు మార్పు ఏంటి?
ఇప్పటివరకు పీఎఫ్ కోసం నెల జీతంలో గరిష్ఠంగా రూ.15 వేలనే పరిగణించేవారు. ఈ మొత్తంపై 12 శాతం చొప్పున ఉద్యోగి, సంస్థ పీఎఫ్‌కు రూ.1,800 చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు ఈ పరిమితిని రూ.25 వేలకు పెంచారు. అంటే 12 శాతం లెక్కన ఉద్యోగి వాటా రూ.3,000 వరకు పెరగొచ్చు. సంస్థ కూడా రూ.3,000 వరకు జమ చేయొచ్చు. దీంతో పీఎఫ్ ఖాతాలోకి వెళ్లే మొత్తం పెరుగుతుంది.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
బేసిక్ జీతం, డీఏ కలిపి రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉన్న ఉద్యోగులకు ఈ మార్పు ఎక్కువగా ఉపయోగపడొచ్చు. గతంలో రూ.15 వేల వరకు మాత్రమే పీఎఫ్ లెక్కించేవారు. ఇక కొత్త పరిమితి వర్తించే చోట రూ.25 వేల వరకు లెక్కిస్తారు. అయితే ఇప్పటికే పూర్తి బేసిక్ జీతంపై పీఎఫ్ చెల్లిస్తున్న ఉద్యోగులకు ఈ మార్పుతో ప్రత్యేకంగా అదనపు ప్రభావం ఉండదు.
పెన్షన్ వాటా కూడా పెరుగుతుంది
పీఎఫ్‌లో సంస్థ చెల్లించే 12 శాతం మొత్తంలో కొంత భాగం ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్)కు వెళుతుంది. గతంలో రూ.15 వేల పరిమితిపై 8.33 శాతం లెక్కన నెలకు గరిష్ఠంగా రూ.1,250 ఈపీఎస్‌కు వెళ్లేది.
ఇప్పుడు పరిమితి రూ.25 వేలకు పెరగడంతో ఈపీఎస్ వాటా నెలకు రూ.2,083 వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగి భవిష్యనిధితో పాటు పెన్షన్ ప్రయోజనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలంలో ఏం జరుగుతుంది?
పీఎఫ్‌లో ప్రతి నెల అదనంగా జమయ్యే మొత్తం చిన్నదిగా కనిపించొచ్చు. కానీ అది సంవత్సరాల పాటు ఖాతాలో కొనసాగుతుంది. దానిపై వచ్చే వడ్డీ కూడా మళ్లీ జమవుతుంది. దీంతో కాలం గడిచేకొద్దీ పొదుపు మొత్తం పెరుగుతుంది.
అందుకే కొత్త పీఎఫ్ పరిమితి వల్ల ఉద్యోగుల చేతికి వచ్చే జీతం కొంత తగ్గినా.. భవిష్యత్ పొదుపు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నవారికి ఈ అదనపు పీఎఫ్ జమ దీర్ఘకాలంలో ఉపయోగపడొచ్చు.