బ్యాంక్‌ ఖాతాదారులకు అలర్ట్‌.. 3 రోజులు సమ్మె.. ముందే ఈ పనులు పూర్తి చేసుకోండి!

బ్యాంక్‌ ఖాతాదారులకు అలర్ట్‌.. 3 రోజులు సమ్మె.. ముందే ఈ పనులు పూర్తి చేసుకోండి!

Bank Strike Alert 3 Days Strike From September 28 Complete Your Tasks Early
  • సెప్టెంబర్‌ 28-30 వరకు మూడు రోజుల బ్యాంక్‌ సమ్మె
  • సెప్టెంబర్‌ 27 ఆదివారం పనిచేయనున్న ప్రభుత్వ బ్యాంకులు
  • ఆర్‌ఆర్‌బీలు సైతం ఆదివారం తెరిచే ఉంటాయి
  • ముఖ్యమైన లావాదేవీలు ముందే పూర్తి చేసుకోవాలని బ్యాంకుల సూచన
  • అందుబాటులో ఉండనున్న యూపీఐ, ఏటీఎం, మొబైల్‌ బ్యాంకింగ్‌
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో ఈ సమ్మె జరగనుంది. దీంతో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీలు) బ్రాంచ్‌ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. 

సమ్మెకు ముందు వారాంతపు సెలవులు ఉండటంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖల సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ముఖ్యమైన నగదు లావాదేవీలు, చెక్కులు, ఇతర బ్రాంచ్‌ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. 

రేపు బ్యాంకులు తెరిచే ఉంటాయి
ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 27న ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం-లింక్‌ శాఖలు పనిచేసేందుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది.

డిజిటల్‌ సేవలు ఉపయోగించండి
సమ్మె సమయంలో బ్రాంచ్‌ సేవలకు అంతరాయం వచ్చినా డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవచ్చు. ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, ఏటీఎంలు, క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లను ఉపయోగించుకోవాలని ఖాతాదారులను కోరాయి. 

ఏం కోరుతున్నారు?
ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయడంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన ఇతర అంశాలపై యూనియన్లు డిమాండ్లు చేస్తున్నాయి. ప్రభుత్వం సమ్మెను విరమించాలని కోరుతూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే సెప్టెంబర్‌ 28-30 సమ్మెకు యూనియన్లు ముందుకు సాగుతున్నట్లు తాజా సమాచారం.
Advertisement
Bank Strike
United Forum of Bank Unions
Banking Services Alert
September Bank Holidays
5 Day Banking Demand
Digital Banking Services

More Telugu News