వైన్ షాపులో కోతి హల్‌చల్.. ఫుల్లుగా తాగి అక్కడే నిద్ర.. ఇదిగో వీడియో!
- మద్యం షాపులోకి ప్రవేశించిన ఓ ఆడ కోతి
- బాటిల్‌లోని మద్యాన్ని తాగి అక్కడే నిద్రపోయిన వైనం
- షాపు యజమాని సమాచారంతో వచ్చి దాన్ని బయటకు తీసిన రెస్క్యూ టీం
- ఝార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఫన్నీ ఘటన
ఝార్ఖండ్‌లో ఓ విచిత్రమైన ఘటన అందరినీ ఆశ్చర్యానికి, నవ్వులకు గురిచేసింది. రాంచీలోని ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించిన ఓ కోతి, అక్కడున్న మద్యం తాగి మత్తులో అక్కడే నిద్రపోయింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. రాంచీ సమీపంలోని ఓర్మాంఝి బ్లాక్ చౌక్‌లో ఉన్న ఓ లిక్కర్ షాపులోకి శనివారం అకస్మాత్తుగా ఓ ఆడ కోతి ప్రవేశించింది. షాపు లోపల కాసేపు అటూ ఇటూ తిరిగింది. అనంతరం అక్కడ ఉన్న ఓ మద్యం బాటిల్‌ను చేతిలోకి తీసుకుని, అందులోని మద్యాన్ని తాగేసింది. ఆ తర్వాత అక్కడే ఓ మూలన హాయిగా నిద్రలోకి జారుకుంది.
అనుకోని ఈ అతిథి రాకతో షాపు యజమానులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం ఘటనా స్థలానికి చేరుకుని, నిద్రిస్తున్న కోతిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నించింది. మద్యం తాగి మత్తెక్కిన కోతి ప్రవర్తన అక్కడున్న వారిని ఆశ్చర్యపరచడంతో పాటు నవ్వులు పూయించింది.