హోటళ్లలో బెడ్‌షీట్లు తెల్లగానే ఎందుకుంటాయో తెలుసా? అసలు కారణం ఇదే!
- శుభ్రతకు ప్రతీకగా మారిన తెల్లటి బెడ్‌షీట్లు
- మరకలు సులభంగా కనిపించడం ప్రధాన కారణం
- అతిథుల్లో ప్రశాంతతను కలిగించే తెలుపు
- హోటళ్లకు లాండ్రీ నిర్వహణ సులభం
- తెలుపుతో గది విశాలంగా ఉందనే భావన
హోటల్ గదిలోకి అడుగుపెట్టగానే ముందుగా కనిపించేది ఏంటి? చక్కగా సర్దిన మంచం.. దానిపై మెరిసిపోతున్న తెల్లటి బెడ్‌షీట్! స్టార్ హోటల్ అయినా, చిన్న లాడ్జి అయినా ఈ తెల్లటి షీట్లకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది కేవలం అందం కోసం తీసుకున్న నిర్ణయం కాదు. దాని వెనుక చరిత్రతో పాటు మనస్తత్వానికి సంబంధించిన కారణాలు, హోటళ్ల నిర్వహణకు ఉపయోగపడే వ్యాపార లెక్కలు కూడా ఉన్నాయి.
తెలుపు వెనుక చరిత్ర
ఎప్పటి నుంచో తెలుపును పరిశుభ్రత, స్వచ్ఛతకు ప్రతీకగా చూస్తున్నారు. విక్టోరియన్ కాలంలో హోటళ్లకు వచ్చే అతిథుల్లోనూ తెల్లటి వస్త్రాలు శుభ్రతపై నమ్మకాన్ని పెంచేవి. మరకలు, మురికి సులభంగా కనిపిస్తాయి గనక తెల్లటి వస్త్రాలు పరిశుభ్రంగా ఉన్నాయో? లేదో? తెలిసిపోతుందనే భావన కలిగించేవి. దీంతో తెలుపు క్రమంగా విలాసానికి కూడా గుర్తుగా మారింది. పర్యాటకం పెరిగేకొద్దీ ఇదే పద్ధతి హోటళ్లలో సాధారణంగా మారింది.
మనసుపై తెలుపు ప్రభావం
తెల్లటి బెడ్‌షీట్ కనిపించగానే చాలామందికి శుభ్రత, ప్రశాంతత గుర్తుకొస్తాయి. చక్కగా సర్దిన తెల్లటి మంచం గది శుభ్రంగా ఉందనే భావనను కలిగిస్తుంది. కొత్త ప్రదేశంలో బస చేసే అతిథులకు ఈ తొలి అనుభూతి చాలా ముఖ్యం. హోటల్ గది ఎలా ఉండాలనే దానికి తెల్లటి మంచం దాదాపు ఒక గుర్తుగా మారిపోయింది.
హోటళ్లకు కూడా లాభమే!
తెల్లటి వస్త్రాల వల్ల హోటళ్లకు నిర్వహణ సులభమవుతుంది. మరకలు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని వెంటనే ఉతికి శుభ్రం చేయొచ్చు. అవసరమైతే బ్లీచ్ చేసి మరకలను తొలగించవచ్చు. రంగు, డిజైన్ వేర్వేరుగా ఉండే వస్త్రాలను నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకే రకమైన షీట్లు, టవళ్లు వేర్వేరు గదుల్లో ఉపయోగించవచ్చు.
అన్ని హోటళ్లలో ఒకే అనుభూతి
ముఖ్యంగా పెద్ద హోటల్ చైన్లకు ఇది ఎంతో ఉపయోగకరం. ఒక నగరంలో ఉన్న హోటల్‌లో కనిపించే తెల్లటి బెడ్‌షీట్, మరో నగరంలో ఉన్న అదే సంస్థ హోటల్‌లోనూ కనిపిస్తుంది. దీంతో అతిథులకు ఎక్కడ బస చేసినా ఒకే తరహా అనుభూతి కలుగుతుంది. తెల్లటి లినెన్ ఆ హోటల్ గుర్తింపులో భాగంగా మారుతుంది.
అందం కూడా ఒక కారణమే
తెలుపు గదిని మరింత విశాలంగా కనిపించేలా చేస్తుంది. గదిలోని వెలుతురును కూడా బాగా ప్రతిబింబిస్తుంది. అందుకే గది మరింత హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. తెల్లటి టవళ్లు, బాత్‌రోబ్‌లు స్పా, విశ్రాంతి భావనను కలిగిస్తాయి. పైగా ఏ రంగు ఫర్నిచర్, డెకరేషన్‌తోనైనా తెలుపు సులభంగా కలిసిపోతుంది.
హోటళ్ల ప్రకటనల్లోనూ తెల్లటి మంచానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. తెల్లటి దుప్పటి, దిండ్లతో చక్కగా సర్దిన మంచం కనిపించగానే శుభ్రత, సౌకర్యం, విలాసం గుర్తుకొస్తాయి. అందుకే హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లు ఇప్పుడు సాధారణ వస్త్రాలు కాదు.. ఆతిథ్య రంగానికి ప్రత్యేక గుర్తుగా మారిపోయాయి.