ఏరిస్.. టాటా కొత్త సెడాన్‌.. ధర నిజంగా షాకే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏరిస్.. టాటా కొత్త సెడాన్‌.. ధర నిజంగా షాకే!

Tata new sedan at budget price with amazing features
  • భారత్‌లో విడుదలైన టాటా ఏరిస్‌
  • ప్రారంభ ధర రూ.5.29 లక్షలు
  • ఇప్పటికే ప్రారంభమైన బుకింగ్స్‌
  • అక్టోబర్‌ 11 నుంచి డెలివరీలు
  • పెట్రోల్‌, ఐ-సీఎన్‌జీ ఆప్షన్లు
టాటా మోటార్స్‌ సెడాన్‌ విభాగంలో కొత్త కారును తీసుకొచ్చింది. ‘టాటా ఏరిస్‌’ పేరుతో ఈ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధరను రూ.5.29 లక్షలుగా నిర్ణయించింది. ఇవి ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరలు. బుకింగ్స్‌ ఇప్పటికే మొదలయ్యాయి. అక్టోబర్‌ 11 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

‘టిగోర్‌’తో పోలిస్తే ఏరిస్‌లో డిజైన్‌, ఫీచర్ల పరంగా పలు మార్పులు చేశారు. ముందు భాగం ప్రస్తుత టియాగో తరహాలో కనిపిస్తుంది. సైడ్‌ ప్రొఫైల్‌లో రూఫ్‌లైన్‌ వెనుక భాగంతో కలిసేలా సాఫ్ట్‌ కర్వ్స్‌ ఇచ్చారు. వెనుక భాగంలో కొత్త టెయిల్‌ల్యాంప్స్‌ ఉన్నాయి. వీటిని మధ్యలో ఉన్న టాటా లోగో వరకు సాగే స్ట్రిప్‌తో కలిపారు. టెయిల్‌గేట్‌పై ‘Aeris’ పేరును ఇచ్చారు.

కారు లోపల 10.25 అంగుళాల ఫ్లోటింగ్‌ టచ్‌స్క్రీన్‌ ఉంది. పూర్తిగా డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, మూడు స్పోక్‌ల స్టీరింగ్‌ వీల్‌ ఉన్నాయి. ఆటోమేటిక్‌ వేరియంట్లలో ప్యాడిల్‌ షిఫ్టర్లు కూడా లభిస్తాయి. లెదరెట్‌ సీట్లు, సాఫ్ట్‌టచ్‌ మెటీరియల్స్‌ అందించారు.

ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే, వెంటిలేటెడ్‌ సీట్లు, రెండు వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్ల వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఈఎస్‌పీ, టీపీఎంఎస్‌, హిల్‌హోల్డ్‌ కంట్రోల్‌, బ్లైండ్‌ వ్యూ మానిటరింగ్‌, 360 డిగ్రీ కెమెరా, డ్యాష్‌క్యామ్‌ వంటి సదుపాయాలు ఇచ్చారు.

ఏరిస్‌లో 1.2 లీటర్‌ నేచురల్లీ యాస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 86 హెచ్‌పీ పవర్‌, 113 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఐ-సీఎన్‌జీ ఆప్షన్‌ కూడా ఉంది. సీఎన్‌జీ వెర్షన్‌లో ట్విన్‌ సిలిండర్‌ సెటప్‌ ఇచ్చారు. దీంతో 419 లీటర్ల బూట్‌ స్పేస్‌ లభిస్తుంది. మారుతి సుజుకి డిజైర్‌, హ్యుందాయ్‌ ఆరా వంటి కార్లకు ఇది పోటీగా నిలవనుంది.

వేరియంట్‌ వారీ ధరలు
పెట్రోల్‌ ఎంటీ: రూ.5.29 లక్షల నుంచి రూ.8.19 లక్షలు
ఐ-సీఎన్‌జీ ఎంటీ: రూ.6.29 లక్షల నుంచి రూ.9.19 లక్షలు
Advertisement
Tata Aeris
Tata Motors
New Sedan India
Budget Sedan India
Tata Aeris Price
CNG Sedan India

More Telugu News