మూడు రోజుల్లో 73 శాతం జంప్.. దూసుకెళ్తున్న హీరో మోటార్స్ షేర్లు
- సెప్టెంబర్ 23న స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన హీరో మోటార్స్ షేర్లు
- ఇష్యూ ధర రూ.84తో పోలిస్తే నిఫ్టీలో రూ.82 వద్ద లిస్టయిన షేర్లు
- తర్వాత అనూహ్యంగా పెరిగిన కొనుగోళ్ల మద్దతు
- వరుసగా రెండోరోజూ 20 శాతం వద్ద అప్పర్ సర్క్యూట్
- ఆటోమొబైల్ కంపెనీలకు అవసరమైన పవర్‌ట్రెయిన్ సొల్యూషన్స్‌ను అందిస్తున్న కంపెనీ
స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన మూడు రోజుల్లోనే హీరో మోటార్స్ షేర్ భారీ లాభాలను అందుకుంది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఈ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్‌ఈలో రూ.141.85 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6,443.05 కోట్లకు చేరింది.
హీరో మోటార్స్ షేర్లు సెప్టెంబర్ 23న దలాల్ స్ట్రీట్‌లో లిస్టయ్యాయి. ఐపీఓ ఇష్యూ ధర రూ.84 కాగా.. ఎన్‌ఎస్‌ఈలో రూ.82 వద్ద లిస్టయ్యాయి. అంటే 2.38 శాతం డిస్కౌంట్‌తో మార్కెట్‌లోకి వచ్చాయి. బీఎస్‌ఈలో రూ.82.10 వద్ద లిస్టయ్యాయి. అయితే లిస్టింగ్ తర్వాత షేర్‌కు కొనుగోళ్ల మద్దతు పెరిగింది. దీంతో లిస్టింగ్ ధరతో పోలిస్తే ఇప్పటివరకు దాదాపు 73 శాతం పెరిగింది.
అమెరికా, యూరప్, భారత్, ఆసియాన్ దేశాల్లోని ఆటోమొబైల్ కంపెనీలకు అవసరమైన పవర్‌ట్రెయిన్ సొల్యూషన్స్‌ను హీరో మోటార్స్ అందిస్తోంది. కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు జరిగింది. మొత్తం 6.66 రెట్లు సబ్‌స్క్రిప్షన్ వచ్చింది.
ఐపీవో ద్వారా కంపెనీ రూ.1,000 కోట్లు సమీకరించింది. ఇందులో రూ.600 కోట్ల విలువైన 7.14 కోట్ల తాజా షేర్లను జారీ చేసింది. మరో రూ.400 కోట్ల విలువైన 4.76 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంచింది
2023-24-2025-26 మధ్య కంపెనీ ఆదాయం 5.7 శాతం, EBITDA 34.3 శాతం, నికర లాభం 55.5 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.