డబ్బులు చెల్లించడానికి కాదు.. క్యూఆర్ కోడ్ అసలు ఎందుకు పుట్టిందో తెలుసా?
- 1994లో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ
- రూపొందించిన డెన్సో వేవ్ సంస్థ
- కార్ల విడిభాగాల గుర్తింపే అసలు లక్ష్యం
- బార్‌కోడ్‌లకు ప్రత్యామ్నాయంగా రూపకల్పన
- పేటెంట్ హక్కుల సడలింపుతో విస్తృత వినియోగం
ఈరోజు ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్‌లే. రెస్టారెంట్‌లో మెనూ చూడాలన్నా.. షాపింగ్ చేయాలన్నా.. డబ్బులు పంపాలన్నా.. టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. కానీ ఈ చిన్న నలుపు-తెలుపు రంగులో చతురస్రం అసలు ఎందుకు పుట్టిందో తెలుసా? డిజిటల్ పేమెంట్స్ కోసం మాత్రం కాదు. కార్ల తయారీలో విడిభాగాలను గుర్తించేందుకు క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు.
టయోటా కార్ల ఫ్యాక్టరీల్లో మొదలు..
క్యూఆర్ కోడ్‌ను జపాన్‌కు చెందిన డెన్సో వేవ్ సంస్థ 1994లో రూపొందించింది. ఈ సంస్థకు టయోటాతో అనుబంధం ఉంది. అప్పట్లో కార్ల తయారీ ఫ్యాక్టరీల్లో వేలాది రకాల విడిభాగాలను గుర్తించడం, వాటి వివరాలను నమోదు చేయడం పెద్ద సవాలుగా ఉండేది.
అప్పటివరకు సాధారణ బార్‌కోడ్‌లనే ఉపయోగించేవారు. అయితే వాటిలో పరిమిత సమాచారం మాత్రమే నిక్షిప్తం చేయగలిగేవారు. ఒకే విడిభాగానికి ఎక్కువ వివరాలు కావాలంటే.. దానిపై అనేక బార్‌కోడ్‌లు పెట్టాల్సి వచ్చేది. వాటిని ఒక్కొక్కటిగా స్కాన్ చేయడం వల్ల తయారీ ప్రక్రియ నెమ్మదించేది.
ఇంజినీర్ ఆలోచనతో కొత్త కోడ్..
ఈ సమస్యకు పరిష్కారం కోసం డెన్సో వేవ్ ఇంజినీర్ మసాహిరో హరా, ఆయన బృందం కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. చిన్న నలుపు-తెలుపు చతురస్రాలతో ఉండే టూ-డైమెన్షనల్ కోడ్‌ను రూపొందించారు. అదే క్యూఆర్ కోడ్.
సాధారణ బార్‌కోడ్‌లతో పోలిస్తే ఇందులో ఎక్కువ సమాచారం దాచుకోవచ్చు. అంతేకాదు.. వేగంగా స్కాన్ చేయొచ్చు. ఫ్యాక్టరీలో ఏ కోణంలో ఉన్నా సులభంగా గుర్తించేలా దీన్ని రూపొందించారు.
మూలల్లో ఉన్న మూడు చతురస్రాల వెనుక కారణం ఇదే..
క్యూఆర్ కోడ్ మూలల్లో కనిపించే మూడు పెద్ద చతురస్రాలు కేవలం డిజైన్ కోసం పెట్టినవి కావు. స్కానర్‌కు కోడ్ ఎక్కడ ఉంది.. ఏ దిశలో ఉంది అనే విషయాన్ని గుర్తించేందుకు అవి ఉపయోగపడతాయి. అందుకే క్యూఆర్ కోడ్‌ను వివిధ కోణాల నుంచి కూడా సులభంగా చదవొచ్చు.
పేటెంట్ ఉన్నా.. అందరికీ అందుబాటులోకి..
క్యూఆర్ కోడ్ సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి రావడానికి మరో కారణం ఉంది. డెన్సో వేవ్ తన పేటెంట్ హక్కులను కఠినంగా అమలు చేయలేదు. దీంతో వ్యాపార సంస్థలు, డెవలపర్లు పెద్దగా లైసెన్స్ ఫీజులు చెల్లించకుండానే ఈ సాంకేతికతను ఉపయోగించగలిగారు. అలా కారు ఫ్యాక్టరీలకే పరిమితమైన సాంకేతికత క్రమంగా ప్రపంచమంతా విస్తరించింది.
ఇప్పుడు రోజువారీ జీవితంలో భాగం..
రెస్టారెంట్ మెనూల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు.. టికెట్ల నుంచి ఉత్పత్తుల లేబుళ్ల వరకు క్యూఆర్ కోడ్ వినియోగం పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్‌తో క్షణాల్లో స్కాన్ చేయొచ్చు. ఒక క్యూఆర్ కోడ్‌లో 7,000కుపైగా అక్షరాల సమాచారాన్ని నిల్వ చేయగల సామర్థ్యం ఉండటంతో దీని వినియోగం మరింత విస్తరించింది.