- విశాఖ సీఐఐ సదస్సులో ఎంవోయూ చేసుకున్న 'నమస్తే వరల్డ్'
- ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి పెట్టనున్న మంచు మనోజ్ దంపతులు
- కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం
- భారతీయ సంస్కృతి ఉట్టిపడే బొమ్మలు, హస్తకళల తయారీ
- పారిశ్రామికవేత్త హోదాలో ఒప్పందంపై సంతకం చేసిన భూమా మౌనిక
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో సినీ నటుడు మంచు మనోజ్, ఆయన అర్ధాంగి భూమా మౌనిక రెడ్డి స్థాపించిన ‘నమస్తే వరల్డ్’ స్టార్టప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో రూ.36 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఈ ఎంవోయూ చేసుకున్నారు.
పారిశ్రామికవేత్త హోదాలో, ‘నమస్తే వరల్డ్’ వ్యవస్థాపకురాలిగా భూమా మౌనిక రెడ్డి ఈ ఒప్పందంపై సంతకం చేశారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో వీరి పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ స్టార్టప్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పిల్లల ఆటబొమ్మలు, హస్తకళా ఉత్పత్తులను తయారు చేసి స్వదేశీ కళాకారులకు ప్రోత్సాహం అందించనున్నారు.
ఈ సందర్భంగా భూమా మౌనిక మాట్లాడుతూ.. సీఐఐ సదస్సు ద్వారా ఎంతో మంది హస్తకళాకారులు, యువ పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి రావడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక కళాకారులు, స్టార్టప్‌ల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు కల్పించడంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వానికి, నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.