- ప్రమాదంలో 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి
- ఇంజిన్ వేరుపడి మంటలు.. నుజ్జునుజ్జయిన వాహనం
- ప్రమాదానికి ముందు స్పీడోమీటర్ ఫొటోలు స్నేహితులకు షేర్
ఢిల్లీలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌పోర్ట్ టన్నెల్‌లో గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి, గోడను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారు ఇంజిన్ ఊడిపోయి దూరంగా పడి మంటలు అంటుకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన అభినవ్ సింగ్‌గా గుర్తించారు. గురుగ్రామ్‌లో నివసిస్తున్న అభినవ్, లూధియానా నుంచి తిరిగి వస్తుండగా శివమూర్తి ఇంటర్‌ఛేంజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్‌లో గరిష్ఠ వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లు కాగా, అభినవ్ పరిమితికి మించి అత్యంత వేగంతో ప్రయాణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు, అభినవ్ తన కారు స్పీడోమీటర్ ఫొటోలు, వీడియోలను తీసి స్నాప్‌చాట్ ద్వారా స్నేహితులకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో కారు రాకెట్‌లా దూసుకెళ్లి, NH-48కి కలిపే మలుపు వద్ద గోడను ఢీకొట్టిన దృశ్యాలు రికార్డయ్యాయి.
పీటీఐ కథనం ప్రకారం అభినవ్ తన స్నేహితుడికి చెందిన లగ్జరీ కారును నడుపుతున్నట్లు తెలిసింది. వాహనం నుజ్జునుజ్జు కావడంతో అభినవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.