తొలిరోజు 1.8 శాతం లాభం.. రూ.1,818 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ షేరు
- భారీ అంచనాల మధ్య నేడు మార్కెట్లలో లిస్ట్ అయిన ఎన్‌ఎస్‌ఈ షేర్లు
- 0.8 శాతం లాభంతో బీఎస్‌ఈలో రూ.1,800 వద్ద లిస్టయిన షేర్లు
- ఇంట్రాడేలో ఓ దశలో ఐదు శాతం లాభపడిన వైనం
- చివరకు 1.8 శాతం లాభంతో రూ.1,818 వద్ద ముగింపు
- రూ.1,700-1,785 ధరల శ్రేణితో ఐపీఓకి వచ్చిన ఎన్‌ఎస్‌ఈ
భారీ అంచనాలతో వచ్చిన ‘నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ తర్వాత షేర్లు స్టాక్ మార్కెట్లో స్వల్ప లాభంతో ముగిశాయి. రూ.1,785 ఇష్యూ ధరగా ఉన్న షేర్లు గురువారం రూ.1,818 వద్ద ముగిశాయి. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే 1.8 శాతం లాభం నమోదైంది. ఇంట్రాడేలో ఓ దశలో షేరు 5 శాతానికి పైగా ఎగబాకింది.
ఎన్‌ఎస్‌ఈ షేర్లు బీఎస్‌ఈలో రూ.1,800 వద్ద లిస్టయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 0.8 శాతం ప్రీమియం. అయితే గ్రే మార్కెట్‌లో ఊహించిన స్థాయిలో లాభం రాలేదు. లిస్టింగ్ సమయానికి ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ సుమారు రూ.4.45 లక్షల కోట్లుగా నమోదైంది.
పెట్టుబడిదారులకు మరింత సౌకర్యంగా ఉండేలా మొబైల్ ఆధారిత సమగ్ర ప్లాట్‌ఫామ్‌పై ఎన్‌ఎస్‌ఈ పనిచేస్తోందని సంస్థ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ తెలిపారు. ఇందులో ట్రేడింగ్ డేటా, పోర్ట్‌ఫోలియో వివరాలు, విశ్లేషణలను ఒకే చోట అందించేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో క్యాపిటల్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు జరిగింది. 5.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రూ.22,568.94 కోట్ల ఇష్యూ పరిమాణానికి రూ.90,287.33 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఒక్కో షేరుకు రూ.1,700-1,785 ధరల శ్రేణిని నిర్ణయించారు. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో జరిగింది. ఇప్పటికే ఉన్న వాటాదారులు 12.64 కోట్ల షేర్లను విక్రయించారు.
2024లో వచ్చిన రూ.27,870 కోట్ల హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ తర్వాత దేశంలో ఇదే రెండో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ. ఎన్‌ఎస్‌ఈ ఆదాయంలో ట్రేడింగ్ ఛార్జీల వాటా భారీగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయంలో 78.65 శాతం లావాదేవీల ఛార్జీల నుంచే వచ్చింది. ఇందులో ఆప్షన్స్ ట్రేడింగ్ ఒక్కటే 60 శాతానికి పైగా ఆదాయాన్ని అందించింది.