ఈ దేశంలో బంగారు నగలు ధరించడాన్ని అస్సలు ఇష్టపడరు తెలుసా?
- స్వీడన్‌లో బంగారు నగలను ధరించడానికి అంతగా ఇష్టపడి సంస్కృతి
- ఆడంబరంగా వ్యవహరిస్తూ సంపద చూపించుకోవడం అక్కడి ప్రజలకు నచ్చదు
- ఈ సంస్కృతే ‘లా ఆఫ్ జాంటే’తో అనే భావనగా ప్రాచుర్యం
- ప్రాంతాన్ని బట్టి ఈ సంస్కృతిలో మార్పులు
మన దగ్గర బంగారం అంటే సంపదకు గుర్తు. పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలు వచ్చాయంటే బంగారు నగలతో మెరిసిపోవడం సాధారణమే. నగలు అలంకరణకే కాదు.. పెట్టుబడిగానూ భావిస్తారు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రం డబ్బు, హోదాను బయటకు చూపించుకోవడాన్ని అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా స్వీడన్‌లో ఖరీదైన వస్తువులు, బంగారు నగలతో హంగామా చేసే సంస్కృతి కనిపించదు.
బంగారాన్ని అసహ్యించుకుంటారా?
అలా అని స్వీడన్‌లో ప్రజలు బంగారం వేసుకోవడాన్ని ద్వేషిస్తారని కూడా చెప్పలేం. అక్కడా బంగారం, వజ్రాలు, ఖరీదైన నగలు కొనేవారు, ధరించేవారు ఉన్నారు. అయితే వాటిని చూపించి తమ ఆర్థిక స్థాయిని చాటుకోవాలనే ధోరణి మాత్రం తక్కువగా కనిపిస్తుంది. వ్యక్తిగత ఇష్టం, వయసు, ప్రాంతం, సామాజిక వర్గాన్ని బట్టి ఈ విషయంలో అభిప్రాయాలు మారుతాయి.
‘జాంటే చట్టం’ ఏంటి?
స్కాండినేవియన్ సమాజంలో సంపద, హోదాపై ఉన్న ఈ ధోరణిని వివరించేటప్పుడు ‘లా ఆఫ్ జాంటే’ అనే భావనను తరచూ ప్రస్తావిస్తారు. డానిష్-నార్వేజియన్ రచయిత ఆక్సెల్ సాండెమోస్ 1933లో రాసిన నవలలో ఈ భావనకు రూపం వచ్చింది. ఇది అసలు చట్టం కాదు. ఎవరైనా ఎక్కువ సంపాదించారని గొప్పగా చెప్పుకోవద్దు. ఇతరుల కంటే తామే గొప్ప అని చూపించుకోవద్దు అనే సామాజిక భావనగా దీన్ని అర్థం చేసుకోవచ్చు.
సంపద కంటే సమానత్వానికే ప్రాధాన్యం
స్వీడన్ సంపన్న దేశమే. అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఎక్కువే. అయినా భారీ బంగారు గొలుసులు, ఖరీదైన డిజైనర్ వస్తువులతో తమ స్థాయిని చూపించుకోవడం అక్కడ చాలా మంది నచ్చదు. ఆడంబరం కంటే సాధారణంగా కనిపించడం మరింత సహజంగా భావించే వాతావరణం కొన్ని వర్గాల్లో ఉంది.