డిజిటల్ చెల్లింపుల్లో భారత్ జోరు.. గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా యూపీఐ.. నెలకు 2,000 కోట్ల లావాదేవీలు
- డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్న బీసీజీ నివేదిక
- 2030 నాటికి 2.6 ట్రిలియన్ డాలర్లకు చేరనున్న గ్లోబల్ పేమెంట్స్ మార్కెట్
- చెల్లింపుల వ్యవస్థలో ఏఐ కీలక పాత్ర పోషించనుందని అంచనా
- యూపీఐతో పాటు క్రెడిట్ కార్డుల వాడకం కూడా పెరుగుతోందని వెల్లడి
భారతదేశ ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం నెలకు 20 బిలియన్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తూ రియల్-టైమ్ పేమెంట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆర్థిక సమ్మిళిత వృద్ధిని, భారీ స్థాయి లావాదేవీలను ఏకకాలంలో ఎలా సాధించవచ్చో యూపీఐ నిరూపించిందని ప్రముఖ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తన నివేదికలో ప్రశంసించింది.
ఈ నివేదిక ప్రకారం, ప్రపంచ చెల్లింపుల రాబడి 2030 నాటికి 2.6 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అయితే, వార్షిక వృద్ధిరేటు గత ఐదేళ్లలో 7% ఉండగా, రానున్న కాలంలో 5 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ప్రాంతాల వారీగా ఈ వృద్ధిలో వ్యత్యాసాలు ఉండనున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్‌లలో వృద్ధి 5% ఉండగా, పశ్చిమాసియా, ఆఫ్రికాలో 8% వేగంతో విస్తరిస్తుందని బీసీజీ అంచనా వేసింది.
ఈ సందర్భంగా బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, భాగస్వామి వివేక్ మాంధాత మాట్లాడుతూ.. "భారత్ సాధించిన ఈ విజయం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఒక అద్భుతమైన మైలురాయి. కోట్లాది మంది సామాన్యులను డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తీసుకురావడమే కాకుండా, లావాదేవీల సంఖ్యను భారీగా పెంచడం ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది" అని అన్నారు.
యూపీఐతో పాటు క్రెడిట్ కార్డుల వాడకం కూడా, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో, సమాంతరంగా పెరుగుతోందని ఇది బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని ఆయన వివరించారు.
భవిష్యత్తులో చెల్లింపుల రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషించనుందని నివేదిక స్పష్టం చేసింది. ఖర్చులు తగ్గించడం, ఉత్పత్తులను మెరుగుపరచడం, పేపర్ ఆధారిత ప్రక్రియలను ఆటోమేట్ చేయడంలో ఏఐ సహాయపడుతుందని పేర్కొంది. అదేవిధంగా, ఏజెంట్ల ద్వారా జరిగే లావాదేవీల (ఏజెంట్-ఇనిషియేటెడ్ ట్రాన్సాక్షన్స్) కోసం మెరుగైన మద్దతు ఇస్తే, తమ పేమెంట్ పార్ట్‌నర్‌ను మార్చుకోవడానికి 73% మంది పెద్ద వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని సర్వేలో తేలింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 137 దేశాలు సొంతంగా తక్షణ చెల్లింపుల వ్యవస్థలను కలిగి ఉండటం గ్లోబల్ పేమెంట్స్ రంగంలో వస్తున్న మార్పులకు నిదర్శనమని నివేదిక పేర్కొంది.