బియ్యానికి పురుగులు పడుతున్నాయా? ఈ సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు!

బియ్యానికి పురుగులు పడుతున్నాయా? ఈ సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు!

Rice bugs prevention and simple tips to keep them away
  • గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయడం మేలు
  • ఎండిన వేపాకులు పురుగులను దూరం పెట్టే ఛాన్స్‌
  • బిర్యానీ ఆకులు కూడా కీటకాలను దూరం చేసే అవకాశం
  • ఎండు మిరపకాయలు, లవంగాలు మరో చిట్కా
  • తడి చేతులు, చెంచాలతో బియ్యం తీయకపోవడం మేలు
వంటగదిలో నిల్వ చేసిన బియ్యంలో చిన్నచిన్న పురుగులు కనిపించడం సాధారణమే. తేమ ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. బియ్యం తేమను త్వరగా పీల్చుకుంటుంది. అదే పురుగులు చేరేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. ఒకసారి పురుగులు పడితే బియ్యాన్ని శుభ్రం చేయడం అంత సులువు కాదు.

అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యను చాలావరకు నివారించొచ్చు. ఇంట్లో సులభంగా దొరికే కొన్ని వస్తువులు కూడా ఇందుకు ఉపయోగపడతాయి.

వేపాకులతో సహజ రక్షణ
బియ్యం డబ్బాలో పూర్తిగా ఎండిన వేపాకులు 8-10 వేయొచ్చు. వేప ఆకుల వాసన పురుగులను దూరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఆకుల్లో తేమ ఏమాత్రం ఉండకూడదు. లేదంటే బియ్యంలోకి తేమ చేరే ప్రమాదం ఉంటుంది.

బిర్యానీ ఆకులు
బిర్యానీ ఆకులు కూడా బియ్యంలో పురుగుల బెడదను తగ్గించేందుకు ఉపయోగించొచ్చు. కొన్ని ఎండిన ఆకులను బియ్యం డబ్బాలో ఉంచితే వాటి ఘాటైన వాసన పురుగులను దూరంగా ఉంచుతుందని చెబుతారు. బియ్యం రుచిపై మాత్రం పెద్దగా ప్రభావం ఉండదు.

ఎండు మిరపకాయలతో మరో చిట్కా
3-4 ఎండు మిరపకాయలను బియ్యంలో వేయొచ్చు. వాటి ఘాటు వాసన పురుగులను దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మిరపకాయల్లో తేమ లేకుండా చూసుకోవడం ముఖ్యం.

లవంగాలు కూడా ఓ ఆప్షన్‌
కొన్ని లవంగాలను బియ్యం డబ్బాలో వేయడం మరో ఇంటి చిట్కా. లవంగాల్లో ఉండే సహజ నూనెల వాసన కీటకాలను దూరంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

తడి చేతులు, చెంచాలు వద్దు
బియ్యం తీసుకునేటప్పుడు తడి చేతులు లేదా తడిగా ఉన్న చెంచాలను ఉపయోగించకండి. ఒక్క చుక్క నీరు కూడా బియ్యంలో తేమను పెంచుతుంది. దీంతో బూజు, పురుగుల సమస్య మొదలయ్యే అవకాశం ఉంటుంది.

ఎప్పటికప్పుడు ఎండలో పెట్టండి
బియ్యం డబ్బాను తరచూ పరిశీలించాలి. తేమ కనిపిస్తే బియ్యాన్ని శుభ్రమైన వస్త్రంపై పరిచి కొన్ని గంటలు ఎండలో ఉంచొచ్చు. ఇలా చేయడం వల్ల బియ్యంలో ఉన్న అదనపు తేమ తగ్గుతుంది. దాచిన పురుగులు ఉంటే బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

డబ్బా విషయంలో జాగ్రత్త
బియ్యాన్ని పూర్తిగా పొడిగా ఉన్న గాలి చొరబడని డబ్బాలోనే నిల్వ చేయాలి. గాజు, ఫుడ్‌ గ్రేడ్‌ ప్లాస్టిక్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డబ్బాలు ఉపయోగించొచ్చు. మూత గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తేమ లోపలికి రాకుండా చూడటమే బియ్యాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు ప్రధాన జాగ్రత్త.
Advertisement
Rice
Rice bugs prevention
Kitchen storage hacks
Natural pest control
Rice preservation tips
Rice weevils remedies

More Telugu News