25 కి.మీ వరకు మైలేజీ.. ఎయిర్ బ్యాగ్‌లు.. రూ.5 లక్షల్లోపు పెట్రోల్ కార్లు
- రూ.3.69 లక్షల నుంచి ఆల్టో కే10
- ఎస్-ప్రెస్సో 25.30 కి.మీ వరకు మైలేజీ
- ఆల్టో కే10లో ఆరు ఎయిర్‌బ్యాగులు
- క్విడ్ ప్రారంభ ధర రూ.4.29 లక్షలు
- టియాగో ప్రారంభ ధర రూ.4.69 లక్షలు
కారు కొనాలని చూస్తున్నారా? బడ్జెట్ రూ.5 లక్షలలోపే ఉండాలనుకుంటున్నారా? మంచి మైలేజీతో పాటు అవసరమైన భద్రతా ఫీచర్లు కూడా కావాలంటే కొన్ని కార్లు మీ పరిశీలనలో ఉండొచ్చు. ఈ ధర పరిధిలో మారుతీ ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, రెనో క్విడ్, టాటా టియాగో వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కార్లు 25 కి.మీ వరకు మైలేజీ ఇస్తాయని కంపెనీలు చెబుతున్నాయి.
మారుతీ ఆల్టో కే10
దేశంలో తక్కువ ధరలో లభించే ఫ్యామిలీ కార్లలో ఆల్టో K10 ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.69 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉంది. 998సీసీ పెట్రోల్ ఇంజిన్ 68 బీహెచ్‌పీ శక్తి, 91 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, వెనుక పార్కింగ్ సెన్సర్లు ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్ 24.39 కి.మీ, ఏఎంటీ వెర్షన్ 24.9 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
మారుతీ ఎస్-ప్రెస్సో
ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.49 లక్షలు. ఎస్‌యూవీ తరహా ఎత్తైన డిజైన్‌తో కనిపించే ఈ కారులో 998సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 68.5 పీఎస్ శక్తి, 91 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. రెండు ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఏఎంటీ వెర్షన్ 25.30 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
రెనో క్విడ్
రూ.4.29 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో క్విడ్ కూడా రూ.5 లక్షల బడ్జెట్‌లోకి వస్తుంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, రూఫ్ రైల్స్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో క్రాసోవర్ తరహా డిజైన్ ఉంటుంది. 999సీసీ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ 67 బీహెచ్‌పీ శక్తి, 91 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి. రెండు ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌సీ, టీపీఎంఎస్, వెనుక కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి. 21.46 నుంచి 22.3 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని పేర్కొంది.
టాటా టియాగో
రూ.4.69 లక్షల ప్రారంభ ధరతో టియాగో ఈ జాబితాలో మరో ఆప్షన్. స్పోర్టీ డిజైన్‌తో పాటు విశాలమైన క్యాబిన్ ఇందులో ఉంది. పెట్రోల్ వెర్షన్ 20 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఫ్యాబ్రిక్ సీట్లు, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.5 లక్షల లోపు బడ్జెట్‌లో పెట్రోల్ కారు కోసం చూస్తున్న వారికి ఈ మోడల్ కూడా ఒక మంచి ఆప్షన్.