కొత్తగా థార్ ఓజీ.. రూ.10.32 లక్షలకే అదిరిపోయే లుక్, ఫీచర్లు!
- 2020 తర్వాత థార్‌కు తొలి పెద్ద అప్‌డేట్
- సీ-డీఆర్‌ఎల్‌లతో కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్
- 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్
- మూడు ఇంజిన్ ఆప్షన్లు
- మడ్, శాండ్, స్నో టెర్రైన్ మోడ్‌లు
మహీంద్రా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త థార్ మార్కెట్లోకి వచ్చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా థార్ ఓజీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.10.32 లక్షలు (ఎక్స్‌షోరూమ్). 2020లో ప్రస్తుత తరం థార్ వచ్చిన తర్వాత ఇదే తొలి పెద్ద అప్‌డేట్. థార్ రాక్స్ తర్వాత అదే డిజైన్ ఫిలాసఫీని కొనసాగిస్తూ కొత్త మార్పులతో దీన్ని తీసుకొచ్చారు.
థార్ ఓజీలో ముందు భాగంలో కొత్త గ్రిల్, సీ-ఆకారపు డీఆర్‌ఎల్‌లతో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ వచ్చాయి. బంపర్ల డిజైన్ కూడా మార్చారు. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు కొత్త డిజైన్ ఇచ్చారు. వెనుక భాగం దాదాపు పాత మోడల్‌లానే ఉన్నా.. టెయిల్ ల్యాంప్స్‌లో స్వల్ప మార్పులు చేశారు. కొత్తగా ఆర్టెమిస్ సిల్వర్, జీన్స్ బ్లూ రంగులను అందిస్తున్నారు.
క్యాబిన్‌లో ట్రఫుల్ బ్రౌన్ లెదర్ సీట్లను బ్లాక్ కలర్‌తో కలిపి ఇచ్చారు. రెండో వరుసలో ఆర్మ్‌రెస్ట్, కప్‌హోల్డర్లు జోడించారు. వాహనంలో శబ్దం, వైబ్రేషన్లు తగ్గేలా మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎంఐడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
వైర్‌లెస్ ఛార్జర్, క్రూజ్ కంట్రోల్, టైర్ డైరెక్షన్ మానిటరింగ్, రియర్ వ్యూ కెమెరా, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకునే ఓఆర్‌వీఎంలు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు అందించారు. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, ఆల్-డిస్క్ బ్రేకులు, వెహికల్ డైనమిక్స్ కంట్రోల్, రోల్‌ఓవర్ మిటిగేషన్, హిల్ హోల్డ్, ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి.
ఇంజిన్ ఆప్షన్లలో 1.5 లీటర్ డీజిల్, 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఉన్నాయి. 1.5 లీటర్ డీజిల్ 116 హెచ్‌పీ, 300 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 2.2 లీటర్ డీజిల్ 150 హెచ్‌పీ, 330 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ 159 హెచ్‌పీ, 330 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
థార్ ఓజీలో ఆర్‌డబ్ల్యూడీతో పాటు 4డబ్ల్యూడీ ఆప్షన్లు ఉన్నాయి. ఛాసిస్, సస్పెన్షన్ సెటప్‌లోనూ మార్పులు చేశారు. రైడ్ క్వాలిటీ మెరుగుపడేలా వాట్స్ లింకేజ్, డావిన్సీ డ్యాంపర్స్‌ను ఉపయోగించారు. మడ్, శాండ్, స్నో కోసం ప్రత్యేక టెర్రైన్ మోడ్‌లు కూడా ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి థార్ ఓజీ ధరలు రూ.10.32 లక్షల నుంచి రూ.18.99 లక్షల వరకు ఉన్నాయి.