రూ.1.35 లక్షలకే హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రేంజ్‌ చూస్తే అదిరిపోవాల్సిందే!

రూ.1.35 లక్షలకే హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రేంజ్‌ చూస్తే అదిరిపోవాల్సిందే!

Honda new electric scooter at 135 lakh with amazing range
  • ఒక్క ఛార్జ్‌తో 145 కి.మీ రేంజ్‌
  • 3kWh ఫిక్స్‌డ్‌ బ్యాటరీ ప్యాక్‌.
  • 0-80 శాతం ఛార్జింగ్‌కు 2 గంటల 40 నిమిషాలు
  • 32 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌
  • 5 ఇంచుల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, రోడ్‌సింక్‌
ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హోండా మరో కొత్త ఈవీని భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లైనప్‌లో మూడో మోడల్‌గా హోండా క్యూసీ3ని విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.35 లక్షలు. టీవీఎస్‌ ఐక్యూబ్‌, బజాజ్‌ చేతక్‌, ఏథర్‌ రిజ్టా వంటి స్కూటర్లకు ఇది పోటీ ఇవ్వనుంది. ప్రత్యేకంగా రోజువారీ నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని క్యూసీ3ని రూపొందించినట్లు హోండా తెలిపింది.

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 145 కి.మీ
హోండా క్యూసీ3లో 3kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఫిక్స్‌డ్‌ బ్యాటరీ. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 145 కి.మీ ఐడీసీ రేంజ్‌ వస్తుందని కంపెనీ చెబుతోంది. దీంతో ప్రస్తుతం భారత్‌లో హోండా అందిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో ఇదే ఎక్కువ రేంజ్‌ ఇచ్చే మోడల్‌గా నిలిచింది. బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్‌ చేయడానికి 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది.

5 ఇంచుల టీఎఫ్‌టీ స్క్రీన్‌
క్యూసీ3లో 5 ఇంచుల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంటుంది. ఇందులో స్కూటర్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు కనిపిస్తాయి. హోండా రోడ్‌సింక్‌ కనెక్టివిటీ కూడా ఉంది. దీంతో స్మార్ట్‌ఫోన్‌ కనెక్ట్‌ చేసుకుని పలు స్మార్ట్‌ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌ సౌకర్యం కూడా అందించారు.

32 లీటర్ల స్టోరేజ్‌
కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ఈ స్కూటర్‌లో అండర్‌సీట్‌ స్టోరేజ్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. 32 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. రోజువారీ షాపింగ్‌, బ్యాగులు ఇతర వస్తువులను పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

నాలుగు రంగుల్లో..
హోండా క్యూసీ3 నాలుగు రంగుల్లో లభిస్తుంది. మ్యాట్‌ ఫోటాన్‌ గ్రే మెటాలిక్‌, పర్ల్‌ ప్రీషియస్‌ వైట్‌, పర్ల్‌ షాలో బ్లూ, పర్ల్‌ సైరన్‌ బ్లూ కలర్‌ ఆప్షన్లు ఉన్నాయి.

యాక్టివా ఈ:కి భిన్నమైన బ్యాటరీ
హోండా ఇప్పటికే క్యూసీ1, యాక్టివా ఈ: మోడళ్లను విక్రయిస్తోంది. క్యూసీ1లో 1.5kWh ఫిక్స్‌డ్‌ బ్యాటరీ ఉంటుంది. దీని ఐడీసీ రేంజ్‌ 80 కి.మీ. ధర రూ.90,708 నుంచి మొదలవుతుంది. యాక్టివా ఈ:లో రెండు 1.5kWh స్వాపబుల్‌ బ్యాటరీలు ఉంటాయి. మొత్తం 3kWh సామర్థ్యంతో 102 కి.మీ ఐడీసీ రేంజ్‌ ఇస్తుంది. దీని ధర రూ.1.20 లక్షల నుంచి మొదలవుతుంది. క్యూసీ3లో మాత్రం 3kWh ఫిక్స్‌డ్‌ బ్యాటరీ ఇచ్చి.. 145 కి.మీ రేంజ్‌ను అందిస్తున్నారు.

తొలుత ఈ నగరాల్లోనే..
ప్రస్తుతం హోండా క్యూసీ3 అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండదు. ఢిల్లీ, ఆగ్రా, కటక్‌, సూరత్‌, కొల్లాంలో ఎంపిక చేసిన హోండా రెడ్‌ వింగ్‌ డీలర్‌షిప్‌లలో తొలుత విక్రయాలు ప్రారంభమవుతాయి.
Advertisement
Honda QC3
Honda electric scooter
Honda QC3 price
Honda QC3 range
New Honda EV India
Honda QC3 specifications

More Telugu News