ద్రవ్యోల్బణం నుంచి ఏఐ వరకు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మూడు పిడుగులు!
- ద్రవ్యోల్బణం త్వరగా తగ్గే పరిస్థితి లేదన్న ఐఎంఎఫ్ చీఫ్
- పెరుగుతున్న అప్పుల భారం మరో సవాలని హెచ్చరిక
- ఏఐ పెట్టుబడుల్లో ఆర్థిక ప్రమాదాలు ఉన్నాయని స్పష్టీకరణ
- ఏఐపై అంచనాలు నెరవేరకపోతే షాక్ తప్పదని హెచ్చరిక
- ప్రస్తుత ప్రపంచ వృద్ధి 3 శాతం వద్ద ఉండొచ్చని అంచనా
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు ఊహించిన దానికంటే మెరుగ్గా నిలబడినా.. ముప్పులు మాత్రం కొనసాగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా తెలిపారు. నిరంతరాయంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అప్పుల భారం, కృత్రిమ మేధ (ఏఐ) పెట్టుబడుల్లో ఉన్న ప్రమాదాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారుతున్నాయని చెప్పారు.
న్యూయార్క్‌లో ఆదివారం జరిగిన ఖతార్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ద్రవ్యోల్బణం త్వరగా తగ్గే పరిస్థితి కనిపించడం లేదని జార్జీవా పేర్కొన్నారు. ధరలను అదుపులోకి తెచ్చేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు.
దీంతో ప్రభుత్వాలు, సంస్థలపై అప్పుల చెల్లింపు భారం కూడా పెరుగుతోందని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ అవసరమని అందరికీ అర్థమవుతున్నా.. దానికి తగ్గ చర్యలు మాత్రం ఇంకా సరిపోవడం లేదని జార్జీవా వ్యాఖ్యానించారు.
ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో మరో ప్రమాదం పొంచి ఉందని ఆమె హెచ్చరించారు. ఈ పెట్టుబడుల్లో అప్పులపై ఆధారపడటం, ఒకే రకమైన నిధులు పలుమార్లు పెట్టుబడిగా మారడం వంటి అంశాలను జాగ్రత్తగా గమనించాల్సి ఉందన్నారు. ఏఐపై ఉన్న భారీ అంచనాలు నెరవేరకపోతే.. ఆ నిరాశ ఆర్థిక వ్యవస్థపై ఒక్కసారిగా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
ఏఐ పెట్టుబడులకు సంబంధించిన ప్రధాన ఆర్థిక ప్రమాదం అమెరికాలోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉందన్నారు. అయితే ఆసియా, ఐరోపాలోని పలు దేశాలు ఏఐ సరఫరా వ్యవస్థలో భాగంగా ఉన్నాయని చెప్పారు.
అక్టోబర్‌లో విడుదల చేయనున్న ప్రపంచ ఆర్థిక అంచనాల్లోనూ ఈ ప్రమాదాలు కొనసాగుతాయని జార్జీవా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి దాదాపు 3 శాతం స్థాయిలో ఉండటం గొప్ప విషయమన్నారు. అనేక ఆర్థిక, ఇంధన షాక్‌లు ఎదురైనప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడం ఆశాజనకంగా ఉందని చెప్పారు.