చంద్రశేఖరన్ నియామకం చెల్లదు: టాటా ట్రస్ట్స్ సంచలన ప్రకటన
- సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు తీర్మానానికి చట్టబద్ధత లేదని వెల్లడి
- ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్లలో ఒకరు వ్యతిరేకంగా ఓటు వేయడమే కారణం
- న్యాయపోరాటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ నియామకం
- వాటాదారుల హక్కులను కాలరాయడం ప్రమాదకరమన్న సింఘ్వీ
టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకం టాటా గ్రూప్‌లో మరోసారి వివాదానికి దారితీసింది. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ మెజారిటీ వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్ ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ నియామకం కోసం ఆమోదించిన తీర్మానం చట్టబద్ధంగా చెల్లదని, దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేసింది.
కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (AoA) ప్రకారం, బోర్డు తీసుకునే ఏ నిర్ణయానికైనా టాటా ట్రస్ట్స్ (కంపెనీలో 66 శాతం వాటాదారు) నామినేట్ చేసిన డైరెక్టర్లలో మెజారిటీ మద్దతు తప్పనిసరి. బోర్డులోని ఇద్దరు ట్రస్ట్ నామినీలలో ఒకరు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో, అవసరమైన మద్దతు లభించలేదని, తద్వారా ఆ తీర్మానం వీగిపోయిందని ట్రస్ట్ వాదిస్తోంది. ఓట్లు సమానమైనప్పుడు మాత్రమే చైర్మన్‌కు 'కాస్టింగ్ ఓటు' హక్కు ఉంటుందని, అయితే ట్రస్ట్ నామినీల మద్దతుకు సంబంధించిన ప్రత్యేక నిబంధనను ఇది అధిగమించలేదని స్పష్టం చేసింది.
గతంలో టాటా-మిస్త్రీ కేసులో సుప్రీంకోర్టు సైతం తమ రక్షణ హక్కులను సమర్థించిందని ఈ సందర్భంగా టాటా ట్రస్ట్స్ గుర్తుచేసింది. ప్రస్తుత చైర్మన్ కంపెనీ నిబంధనలను తప్పుగా అన్వయిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ న్యాయపోరాటం కోసం సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని నియమించుకుంది. వాటాదారుల ప్రాథమిక హక్కులను ఈ విధంగా నీరుగార్చడం వందలాది భారతీయ కంపెనీల కార్పొరేట్ పాలనకు ప్రమాదకరమని సింఘ్వీ వ్యాఖ్యానించారు.