రూ.11.99 లక్షలకే టాటా సియెర్రా.. కొత్త ‘లెజెండ్ సిరీస్’లో ఏమేం మారాయంటే?
- ఐదు వేరియంట్లలో కొత్త లైనప్
- ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లపై ఫోకస్
- టాప్ వేరియంట్‌లో 360 డిగ్రీల కెమెరా
- స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్స్
- మూడు ఇంజిన్ ఆప్షన్ల కొనసాగింపు
టాటా మోటార్స్ సియెర్రా లైనప్‌లో కొత్త వేరియంట్ సిరీస్‌ను తీసుకొచ్చింది. ‘సియెర్రా లెజెండ్ సిరీస్’ పేరుతో విడుదల చేసిన ఈ కొత్త శ్రేణి ఎక్స్‌షోరూమ్ ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం ఇంటీరియర్, సౌకర్యాలు, టెక్నాలజీని మరిన్ని వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం.
లెజెండ్ సిరీస్‌లో స్మార్ట్+ ఎల్, ప్యూర్ ఎల్, ప్యూర్ ఎల్(ఓ), ప్యూర్+ ఎల్, అడ్వెంచర్+ ఎల్ వేరియంట్లు ఉన్నాయి. ప్రతి వేరియంట్‌లో ముందున్న వేరియంట్ ఫీచర్లను కొనసాగిస్తూ అదనంగా కొన్ని సౌకర్యాలను అందించారు. దీంతో కొనుగోలుదారులు తమ అవసరానికి తగ్గట్టు క్రమంగా అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
స్మార్ట్+ ఎల్ నుంచి లెదర్ సీట్లు, లెదర్ డోర్ ట్రిమ్స్, ఆర్మ్ రెస్ట్‌లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటో ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంలు, 17 అంగుళాల స్టీల్ వీల్స్, రూఫ్ రైల్స్ ఉన్నాయి. భద్రత విషయంలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పీ, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఇచ్చారు.
ప్యూర్ ఎల్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 8-స్పీకర్ ఆడియో, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, రియర్ కెమెరా, క్రూజ్ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్, టీపీఎంఎస్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. ప్యూర్+ ఎల్‌లో ఫుల్ లెదర్ ఇంటీరియర్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, బాస్ మోడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెనుక యూఎస్‌బీ-సీ ఛార్జర్ల వంటి సౌకర్యాలు ఉన్నాయి.
టాప్ వేరియంట్ అడ్వెంచర్+ ఎల్‌లో 360 డిగ్రీ హెచ్‌డీ సరౌండ్ వ్యూ, బ్లైండ్ స్పాట్ వ్యూ, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్, సూపర్‌గ్లైడ్ సస్పెన్షన్, వివిధ టెర్రైన్ మోడ్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పవర్‌ట్రెయిన్‌లో మాత్రం మార్పులేదు. 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ టీజీడీఐ ఇంజిన్లు అందుబాటులో ఉంటాయి.