స్పామ్‌ కాల్స్‌కు ఇక చెక్‌.. రోబోకాల్స్‌పై ట్రాయ్‌ షాకింగ్‌ రూల్‌!

స్పామ్‌ కాల్స్‌కు ఇక చెక్‌.. రోబోకాల్స్‌పై ట్రాయ్‌ షాకింగ్‌ రూల్‌!

TRAI shocking rule on robocalls to check spam calls
  • విచారణ ఆధారిత ప్రచారానికి 7 రోజుల పరిమితి
  • రోబోకాల్స్‌కు ప్రీ-డిక్లరేషన్‌ తప్పనిసరి
  • డిక్లరేషన్‌ లేని కాల్స్‌ స్పామ్‌గా పరిగణన
  • ఆటోమేటెడ్‌ కాల్‌కు 5 పైసల ఛార్జీ
  • 1601 సిరీస్‌ను ఇతర రంగాలకు విస్తరణ
స్పామ్‌ కాల్స్‌, వాణిజ్య సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆటోమేటెడ్‌ కాల్స్‌, వినియోగదారుల విచారణ ఆధారంగా చేసే ప్రచార కాల్స్‌పై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.

ఒక వ్యక్తి ఏదైనా ఉత్పత్తి లేదా సేవ గురించి కంపెనీని సంప్రదిస్తే.. ఆ విచారణ ఆధారంగా వాణిజ్య సందేశాలు లేదా కాల్స్‌ ఏడు రోజుల వరకే చేసేందుకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అదే విచారణను ఆధారంగా చేసుకుని ప్రచార కమ్యూనికేషన్‌ చేయడానికి వీలుండదు.

ఇక ముందుగా రికార్డు చేసిన వాయిస్‌తో చేసే ఆటోమేటెడ్‌ లేదా రోబోకాల్స్‌కు ‘ప్రీ-డిక్లరేషన్‌’ తప్పనిసరి చేసింది ట్రాయ్‌. ఈ డిక్లరేషన్‌ లేకుండా ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ ద్వారా చేసే కాల్స్‌ను స్పామ్‌గా పరిగణిస్తారు.

అనుమతి లేని ఆటోమేటెడ్‌ కాల్స్‌ను నిరుత్సాహపరిచేందుకు ఒక్కో కాల్‌కు 5 పైసల టెర్మినేషన్‌ ఛార్జీ విధించాలని నిర్ణయించింది. దీంతో వాణిజ్య అవసరాల కోసం ఆటోమేటెడ్‌ కాలింగ్‌ సిస్టమ్స్‌ను దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయాలని ట్రాయ్‌ భావిస్తోంది.

లావాదేవీలు, సేవలకు సంబంధించిన కాల్స్‌ కోసం 1601 సిరీస్‌ నంబర్లను ఇతర రంగాలకు విస్తరించే ప్రక్రియను ట్రాయ్‌ ప్రారంభించింది. తొలి దశలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు, నీటి సరఫరా సంస్థలు, సిటీ గ్యాస్‌ సంస్థలు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు సహా యుటిలిటీ సేవల సంస్థలకు ఈ నంబర్లను కేటాయించనున్నారు. దీంతో సాధారణ 10 అంకెల మొబైల్‌ నంబర్ల నుంచి వచ్చే నకిలీ కాల్స్‌, మోసాలను గుర్తించడం వినియోగదారులకు సులభం కానుంది.
Advertisement
TRAI
Spam calls
Robocalls
New Telecom Rules
1601 series numbers
Telecom Regulatory Authority of India

More Telugu News