అదేమైనా బస్సా?.. విమానంలో ఘోరంగా కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో వైరల్
- లండన్-బంగ్లాదేశ్ విమానంలో ఘటన
- గాల్లోనే కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు
- ఒకరి టీషర్ట్ చిరిగిన దృశ్యాలు వైరల్
- చిన్నారులు, వృద్ధుల్లో భయాందోళన
- క్యాబిన్ సిబ్బంది జోక్యంతో గొడవకు బ్రేక్
సాధారణంగా బస్సులోనో లేదంటే రైల్లోనో ప్రయాణికులు గొడవ పడడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ విమానంలో ఘర్షణకు దిగడం మాత్రం చాలా అరుదు. అదీ విమానం గాల్లో ఉండగా ఈ ఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళుతున్న ‘బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్’ విమానంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా కొట్టుకున్నారు. తొలుత మొదలైన వాగ్వాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సెప్టెంబర్ 16న తాను విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశానని ఉద్దిన్ అలీమ్ అనే వ్యక్తి తెలిపారు. విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఒక్కసారిగా గొడవకు దిగడంతో ఇతర ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని చెప్పారు.
వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు మొదట వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి టీషర్ట్ కూడా చిరిగిపోయింది. చివరకు క్యాబిన్ సిబ్బంది, ఇతర ప్రయాణికులు కలగజేసుకుని ఇద్దరినీ విడదీశారు.
ఈ ఘటనతో విమానంలోని చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయానికి గురయ్యారని అలీమ్ పేర్కొన్నారు. వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగించిందని ఆయన తెలిపారు.
విమానంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉంటామని భావిస్తారని, కానీ ఒక్కసారిగా తోటి ప్రయాణికులు కొట్టుకోవడం భయపెట్టిందని అలీమ్ తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) మహబూబుద్దీన్ అహ్మద్‌కు సమాచారం ఇవ్వగా.. విషయం తన దృష్టికి ఇంకా రాలేదని, దీనిపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు.