నాన్‌స్టిక్ పాన్ అంచుల్లో జిడ్డు పోవట్లేదా? ఇలా చేస్తే చిటికెలో క్లీన్!
- నాన్‌స్టిక్ పాన్ అంచుల జిడ్డును గోరువెచ్చని నీటితో తొలగించొచ్చు
- మొండి జిడ్డు ఉంటే 10-15 నిమిషాలు నానబెట్టాలి
- బేకింగ్ సోడా పేస్ట్‌తో మొండి జిడ్డును సున్నితంగా శుభ్రం చేయాలి
- వెనిగర్, నీటిని సమానంగా కలిపి అంచులను తుడవొచ్చు
- స్టీల్ స్క్రబ్బర్లు, గరుకైన క్లీనింగ్ ప్యాడ్లు వాడొద్దు
వంట పూర్తయ్యాక నాన్‌స్టిక్ పాన్‌ను శుభ్రం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అంచుల చుట్టూ పేరుకునే జిడ్డు మాత్రం అంత సులభంగా వదలదు. నూనె, వంట పదార్థాల మరకలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు క్రమంగా పాన్ అంచులపై పేరుకుని అంటుకుపోతాయి. ఎంత డిష్‌వాష్ లిక్విడ్‌తో కడిగినా పూర్తిగా పోనట్లుగా కనిపిస్తాయి. అయితే ఇందుకోసం ఖరీదైన క్లీనర్లు అవసరం లేదు. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే ఈ జిడ్డును సులభంగా తొలగించొచ్చు.
ముందుగా గోరువెచ్చని నీటితో..
వంట పూర్తయిన వెంటనే పాన్‌ను కడగకండి. ముందుగా పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత పాన్‌లో గోరువెచ్చని నీళ్లు పోసి, కొన్ని చుక్కల మైల్డ్ డిష్‌వాష్ లిక్విడ్ వేయండి. మెత్తని స్పాంజ్ లేదా గుడ్డతో అంచులను నెమ్మదిగా తుడవండి. జిడ్డు గట్టిగా ఉంటే 10-15 నిమిషాలు నానబెట్టండి. దీంతో పేరుకున్న మురికి మెత్తబడి సులభంగా తొలగిపోతుంది.
బేకింగ్ సోడాతో ఇలా..
జిడ్డు ఇంకా అలాగే ఉంటే కొద్దిగా బేకింగ్ సోడాను నీటితో కలిపి పలుచని పేస్ట్‌లా చేసుకోండి. దీన్ని జిడ్డు ఉన్న ప్రాంతంలో మాత్రమే రాసి కొన్ని నిమిషాలు ఉంచండి. తర్వాత మెత్తని స్పాంజ్ లేదా గుడ్డతో సున్నితంగా తుడవండి. గట్టిగా రుద్దకండి. అలా చేస్తే నాన్‌స్టిక్ పూత దెబ్బతినే అవకాశం ఉంటుంది.
వెనిగర్ కూడా ఉపయోగపడుతుంది
అంటుకుపోయిన జిడ్డు కోసం తెల్ల వెనిగర్, నీటిని సమాన మోతాదులో కలిపి ఉపయోగించొచ్చు. ఈ మిశ్రమంలో మెత్తని గుడ్డను ముంచి పాన్ అంచులను తుడవండి. వెనిగర్‌ను ఎక్కువసేపు పాన్‌పై ఉంచకండి. తర్వాత మైల్డ్ డిష్ సోప్‌తో కడిగి శుభ్రం చేయాలి.
స్టీల్ స్క్రబ్బర్‌కు దూరంగా..
జిడ్డు పోవడం లేదని స్టీల్ స్క్రబ్బర్‌తో రుద్దడం అస్సలు మంచిది కాదు. దీంతో నాన్‌స్టిక్ పూతపై గీతలు పడొచ్చు. రఫ్ క్లీనింగ్ ప్యాడ్లు, గరుకైన పొడులను కూడా ఉపయోగించకపోవడమే మంచిది. మెత్తని స్పాంజ్, మైక్రోఫైబర్ గుడ్డ లేదా మెత్తని బ్రష్ వాడటం సురక్షితం.
చివర్లో ఇలా చేయండి
జిడ్డు పూర్తిగా తొలగిన తర్వాత పాన్‌ను నీటితో బాగా కడిగి శుభ్రమైన కిచెన్ టవల్‌తో తుడవాలి. ముఖ్యంగా అంచులు, రిమ్ వద్ద నీరు లేదా మిగిలిన మురికి ఉండకుండా చూసుకోవాలి. వంట పూర్తయిన తర్వాత పాన్‌ను ఎక్కువసేపు అలాగే వదిలేయకుండా శుభ్రం చేస్తే జిడ్డు మందంగా పేరుకోదు. ఇలా జాగ్రత్తగా శుభ్రం చేస్తే నాన్‌స్టిక్ పాన్ ఎక్కువకాలం కొత్తదానిలా ఉంటుంది.