రూ.లక్షలు ఖర్చు చేసి మరీ.. ధనికులు ఈ కుక్కలనే ఎందుకు పెంచుకుంటారు?
- పాటియాలాలో దాడితో పిట్‌బుల్ జాతి కుక్కలపై చర్చ
- పెంపకం, ఆహారం, శిక్షణకు కూడా భారీగా ఖర్చు
- ధర భారత్‌లో రూ.80 వేల నుంచి రూ.5 లక్షల వరకు
- ఖరీదైన కుక్కల పెంపకం స్టేటస్ సింబల్‌గా మారిన వైనం
- శరీరాకృతి, బలం, ప్రత్యేకమైన రూపం మరో కారణం
ఇటీవల పాటియాలాలో అద్దె ఇంటి కోసం వెళ్లిన దంపతులపై పిట్‌బుల్ దాడి చేయడం మరోసారి ఈ జాతి కుక్కల పెంపకంపై చర్చకు తెరతీసింది. పిట్‌బుల్ వంటి బలమైన కుక్కలను కొందరు ధనికులు రూ.లక్షలు ఖర్చు చేసి మరీ పెంచుకుంటున్నారు. వీటి ధరే కాదు.. వాటి పెంపకం, ఆహారం, శిక్షణకు కూడా భారీగా ఖర్చవుతుంది. అయినప్పటికీ ప్రీమియం జాతులపై ఆసక్తి తగ్గడం లేదు.
పిట్‌బుల్ అనేది ఒక ప్రత్యేక జాతి పేరు కాదు.. అమెరికన్ పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, అమెరికన్ బుల్లీ వంటి పలు శక్తివంతమైన జాతులకు ఉపయోగించే సాధారణ పదం. వీటిలో కొన్ని రకాల కుక్కల ధర భారత్‌లో రూ.80 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుందని పెంపుడు జంతువులను విక్రయించే సంస్థల సమాచారం. శరీరాకృతి, బలం, ప్రత్యేకమైన రూపం కారణంగా కొందరికి ఇవి సాధారణ పెంపుడు జంతువుల కంటే ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ఇక ధనిక వర్గాల్లో ఖరీదైన కుక్కల పెంపకం కొన్నిసార్లు స్టేటస్ సింబల్‌గానూ మారుతోంది. పగ్, గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెఫర్డ్, డాచ్‌షండ్, పిట్‌బుల్ వంటి ప్రీమియం జాతుల కోసం కొనుగోలు ధరతో పాటు ఆహారం, వైద్యం, గ్రూమింగ్, శిక్షణకు కూడా రూ.వేలు ఖర్చు చేస్తున్నారు. పిట్‌బుల్ పెంపకానికి మొదటి ఏడాదిలోనే రూ.35 వేల నుంచి రూ.83 వేల వరకు, ఆ తర్వాత నెలకు రూ.5,300-11,000 వరకు ఖర్చవుతుందని అంచనాలు ఉన్నాయి.
అయితే ఖరీదైనదని లేదా శక్తిమంతమైనదని మాత్రమే చూసి కుక్కను ఎంచుకోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. పిట్‌బుల్ సహా ఏ కుక్క ప్రవర్తన అయినా పెంపకం, శిక్షణ, సోషలైజేషన్, యజమాని నియంత్రణపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు వీటి స్వభావాన్ని, బలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల భద్రతకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పిట్‌బుల్‌పై నిషేధం లేకపోయినా, పలు ప్రాంతాల్లో వీటి పెంపకం, బహిరంగ ప్రదేశాల్లో సంచారంపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి.