హైదరాబాద్ ఫార్మా సంస్థ ‘వియాష్’ ధమాకా: 115% పెరిగిన లాభాలు.. రూ.793 కోట్ల రికార్డు!

Viyash Scientific Hyderabad pharma firm records 115 percent profit growth of 793 crore
  • మరోసారి సత్తా చాటిన ఫార్మాస్యూటికల్ దిగ్గజం వియాష్ సైంటిఫిక్
  • భారీ లాభాలతో మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచిన సంస్థ
  • వ్యూహాత్మక చర్యలు, విలీనాలతో రికార్డు ఫలితాలు సాధ్యమయ్యాయన్న సీఈవో హరిబాబు

హైదరాబాద్ ఫార్మా రంగం మరోసారి తన సత్తా చాటింది. ప్రముఖ హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం 'వియాష్ సైంటిఫిక్' (Viyash Scientific) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1 FY27) ఫలితాల్లో ఊహించని రీతిలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రదర్శన నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన ఏకంగా 114.9 శాతం వృద్ధితో రూ.793 కోట్ల భారీ నికర లాభాన్ని ఆర్జించి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఫార్ములేషన్లు, ఏపీఐ (API), కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (CDMO) విభాగాల్లో నమోదు చేసిన బలమైన వృద్ధితో కంపెనీ ఏకీకృత ఆదాయం కూడా 19.5 శాతం పెరిగి రూ.946.4 కోట్లకు ఎగబాకింది. కంపెనీ ఈబిట్డా (EBITDA) 59.2 శాతం వృద్ధితో రూ.204.7 కోట్లకు చేరుకుంది. 


ఈ సందర్భంగా సీఈవో హరిబాబు మాట్లాడుతూ... కంపెనీ చేపట్టిన వ్యూహాత్మక చర్యలు, విలీనాలు, ఖర్చుల నియంత్రణ వల్లే ఈ రికార్డు ఫలితాలు సాధ్యమయ్యాయని వెల్లడించారు. ఇటలీకి చెందిన 'బయో ఫర్ లైఫ్' (BioForLife) సంస్థ కొనుగోలుతో యూరోపియన్ పెట్/యానిమల్ కేర్ మార్కెట్లలో కంపెనీ పట్టు మరింత బిగుసుకుంది. భారత్, యూరప్, అమెరికా సహా 100కు పైగా దేశాల్లో విస్తరించిన వియాష్ సైంటిఫిక్, భవిష్యత్ ప్రణాళికలను ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఈ సాయంత్రం ప్రత్యేక ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించనుంది.

Advertisement
Viyash Scientific
Hyderabad Pharma Company
Pharma Sector Profit Growth
Viyash Scientific Q1 Results
BioForLife Acquisition
Pharmaceutical CDMO API Market

More Telugu News