రాహుల్ గాంధీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. రోజుకు గంట కేటాయిస్తూ ఏం చేస్తారంటే?
- మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్, రన్నింగ్, యోగా చేస్తానని వెల్లడి
- ఫిట్‌నెస్‌లో క్రమం తప్పకుండా చేయడమే కీలకమని వ్యాఖ్య
- ఎంత బిజీగా ఉన్నా వ్యాయామానికి సమయం ఇస్తానని వెల్లడి
- వ్యాయామంతో పాటు ఆహారం, జీవనశైలీ ముఖ్యమని సూచన
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే తన ఫిట్ నెస్ రహస్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో ఓ నెటిజన్ తన ఫిట్‌నెస్ రొటీన్ గురించి అడగ్గా.. ఆయన తన వ్యాయామ అలవాట్లను వెల్లడించారు.
తాను మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్, రన్నింగ్ చేస్తానని రాహుల్ తెలిపారు. ఇటీవల యోగాను కూడా తన వ్యాయామంలో భాగం చేసుకున్నట్లు చెప్పారు. ఇలా ఒకే రకమైన వర్కౌట్‌కు పరిమితం కాకుండా స్ట్రెంత్, ఏరోబిక్, కార్డియోపై దృష్టి పెడతానని వివరించారు.
రోజుకు గంట.. తప్పనిసరి
ఫిట్‌నెస్ కోసం రోజుకు గంట సమయం కేటాయిస్తానని రాహుల్ చెప్పారు. ఖాళీ సమయం దొరికినప్పుడు మాత్రమే వ్యాయామం చేయడం కాకుండా.. తన రోజువారీ జీవితంలోనే దానికి ప్రత్యేక స్థానం కల్పించానని తెలిపారు.
ఎంత బిజీగా ఉన్నా వ్యాయామాన్ని మాత్రం వాయిదా వేయనని చెప్పారు. అవసరమైతే రాత్రి 11 గంటలకు కూడా వ్యాయామం చేస్తానని పేర్కొన్నారు. ఫిట్‌నెస్ కోసం అనువైన సమయం కోసం ఎదురుచూడకుండా.. మనమే సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు.
అసలైన సీక్రెట్
మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్, రన్నింగ్, యోగా కంటే తన ఫిట్‌నెస్‌లో ముఖ్యమైన విషయం పట్టుదల, క్రమం తప్పకుండా కొనసాగించడమే అని రాహుల్ తెలిపారు.
కొన్ని రోజులు ఉత్సాహంగా వ్యాయామం చేసి.. ఆ తర్వాత నెలల తరబడి మానేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పారు. నిరంతరం చేస్తూ ఉంటేనే దాని ఫలితం క్రమంగా పెరుగుతుందని వివరించారు.
వ్యాయామం ఒక్కటే సరిపోదు
ఫిట్‌నెస్ కోసం కేవలం వ్యాయామంపైనే ఆధారపడటం సరిపోదని రాహుల్ అన్నారు. ఆహారం, వ్యాయామం, జీవనశైలి.. మూడింటినీ బ్యాలెన్స్‌డ్‌గా చూసుకోవాలని సూచించారు.
ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికంగా మద్యం తాగుతూ లేదా తరచూ అనారోగ్యకరమైన చిరుతిళ్లు తింటూ కేవలం వ్యాయామం చేయడం వల్ల ఆశించిన ఫలితాలు రావని పేర్కొన్నారు.
మొత్తంగా ఫిట్‌నెస్‌ను ఒక వ్యాయామానికి పరిమితం చేయకుండా.. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిపి కొనసాగించడమే ముఖ్యమని రాహుల్ సూచించారు.