ఈ చిన్న విషయాలే భారత్‌కు తిరిగి రానివ్వడం లేదు.. అమెరికాలోని భారతీయుడి వ్యాఖ్యలు వైరల్
- అమెరికాలో జీవన విధానంపై రుపేశ్ పాండే వీడియో
- ఇంటికి దగ్గర్లోనే పార్కులు, ఆట స్థలాలు ఉంటాయని వెల్లడి
- చిన్న సౌకర్యాలే అమెరికాలో ఉండేందుకు కారణమని వ్యాఖ్య
- ప్రశాంతమైన వీధులు, స్వచ్ఛమైన గాలి ఆకట్టుకుంటాయని వెల్లడి
- రోజువారీ జీవితంలో చిన్న ఆనందాలే ముఖ్యమని అభిప్రాయం
- డబ్బు కంటే జీవన నాణ్యతే ఇండియాకు రాకుండా ఆపుతోందని వ్యాఖ్య
అమెరికాలో జీవితం అంటే ఎక్కువ జీతం, మెరుగైన ఉద్యోగ అవకాశాలే కాదు.. రోజువారీ జీవితంలో దొరికే చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఎంతో ప్రభావం చూపిస్తాయని ఓ భారతీయుడు చెబుతున్నాడు. ఇంటికి ఐదు నిమిషాల దూరంలో పార్కులు, ఆట స్థలాలు, ప్రశాంతమైన వీధులు ఉండటం అలవాటైతే.. తిరిగి భారత్‌కు వెళ్లాలన్న ఆలోచన కూడా కష్టంగా మారుతుందని తన అనుభవాన్ని పంచుకున్నాడు.
రుపేశ్ పాండే అనే వ్యక్తి అమెరికాలో తన ఇంటి చుట్టుపక్కల ఉన్న సౌకర్యాలను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టాడు. ఇంటి నుంచి ఐదు నిమిషాలు నడిస్తే చాలు.. రోజంతా గడిపేంత మంచి ప్రదేశాలు ఉన్నాయని చెప్పాడు.
తన అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోనే బాస్కెట్‌బాల్ కోర్టు ఉందని చూపించాడు. దగ్గర్లో లాన్ టెన్నిస్ కోర్టు ఉందని, అప్పుడప్పుడు అక్కడ ఆడేందుకు వెళ్తానని చెప్పాడు. సమీపంలోని చెరువు వద్ద పిల్లలు చేపలు పడుతుండటాన్ని కూడా వీడియోలో చూపించాడు.
ఈ సౌకర్యాల కంటే వాటితో వచ్చే జీవన విధానమే తనను ఆకట్టుకుంటోందని పాండే చెప్పాడు. అమెరికాలో ఉండి తిరిగి భారత్‌కు వెళ్లకపోవడానికి డబ్బు ఒక్కటే కారణం కాదన్నాడు.
సాయంత్రం వేళ ఇంటికి దగ్గర్లోని పార్కులో చేపలు పట్టడం, ఎప్పుడంటే అప్పుడు టెన్నిస్, బాస్కెట్‌బాల్ ఆడటం, ప్రశాంతమైన రోడ్లపై కుక్కను తీసుకుని నడవడం వంటి చిన్న విషయాలు జీవితంలో భాగమవుతాయని వివరించాడు. కాలుష్యం గురించి ఎప్పుడూ ఆలోచించకుండా స్వచ్ఛమైన గాలి పీల్చడం కూడా అలాంటి సౌకర్యాల్లో ఒకటని పేర్కొన్నాడు.
ఇలాంటి జీవన విధానానికి అలవాటుపడిన తర్వాత వాటిని వదులుకోవడం అంత సులభం కాదని పాండే చెప్పాడు. కొన్ని సందర్భాల్లో డబ్బు కంటే జీవన నాణ్యతే ఎక్కువ విలువైనదని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.