బజాజ్‌ పల్సర్‌ ఎన్‌160 కొత్త అవతార్‌.. ధరలు, ఫీచర్లు ఇవే

Bajaj Pulsar N160 new avatar prices and features details
  • బజాజ్‌ కొత్త పల్సర్‌ ఎన్‌160ను విడుదల
  • రెండు వేరియంట్ల ధరలు రూ.1.33 లక్షల నుంచి ప్రారంభం
  • 165 సీసీ నాలుగు వాల్వుల ఇంజిన్‌
  • నాలుగు రైడింగ్‌ మోడ్‌లు, ట్రాక్షన్‌ కంట్రోల్‌
  • క్రాల్‌ టెక్నాలజీతో సిటీ ట్రాఫిక్ లో ప్రయాణం మరింత సులభం
  • ఐదు అంగుళాల రంగుల స్క్రీన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌
  • మూడు కొత్త రంగుల్లో అందుబాటులోకి బైక్‌
బజాజ్‌ ఆటో తన పల్సర్‌ ఎన్‌160ను కొత్తగా తీర్చిదిద్దింది. ఈసారి ఎన్‌160 ఎస్‌, ఎన్‌160 ఎస్‌ఎస్‌ పేర్లతో రెండు వేరియంట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటి ఎక్స్‌షోరూమ్‌ ధరలు వరుసగా రూ.1,33,511, రూ.1,42,585గా ఉన్నాయి.

కొత్త పల్సర్‌లో 165 సీసీ నాలుగు వాల్వుల ఇంజిన్‌ను అందించారు. ఇది 18.5 హార్స్‌పవర్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ విభాగంలోనే అత్యధిక శక్తిని అందించే ఇంజిన్‌ ఇదేనని పేర్కొంది. 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో అందుకుంటుందని వెల్లడించింది.

ఈ బైక్‌లో ఎలక్ట్రానిక్‌ త్రాటిల్‌ వ్యవస్థను అమర్చారు. ఇది రైడింగ్‌కు అనుగుణంగా ఇంజిన్‌ స్పందనను మార్చి మరింత సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది.

అలాగే రెయిన్, స్పోర్ట్స్‌, రోడ్, ఆఫ్‌రోడ్‌ పేర్లతో నాలుగు రైడింగ్‌ మోడ్‌లను అందించారు. రహదారి పరిస్థితులకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. తొలిసారిగా ట్రాక్షన్‌ కంట్రోల్‌ సదుపాయాన్ని కూడా జోడించారు.

ట్రాఫిక్‌లో తరచూ క్లచ్‌, గేర్లు మార్చాల్సిన అవసరం తగ్గించే క్రాల్‌ టెక్నాలజీని ఈ బైక్‌లో తీసుకొచ్చారు. అలాగే ఐదు అంగుళాల రంగుల తెరతో పాటు గూగుల్‌ మ్యాప్స్‌ సదుపాయాన్ని కల్పించారు. ఈ విభాగంలోని స్పోర్ట్స్‌ బైక్‌ల్లో ఇది తొలిసారి అని బజాజ్‌ తెలిపింది.

బైక్‌కు కొత్త గ్రాఫిక్స్‌, రంగు అల్లాయ్‌ వీల్స్‌, సవరించిన హ్యాండిల్‌బార్‌, ఎత్తైన సీటు ఇచ్చారు. అట్లాంటిక్‌ బ్లూ, పెర్ల్‌ మెటాలిక్‌ వైట్‌, బ్రూక్లిన్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ బైక్‌ అందుబాటులో ఉంటుంది.
Advertisement
Bajaj Pulsar N160
Bajaj Auto
Pulsar N160 S
Pulsar N160 SS
New Bajaj Pulsar features
Sport bikes India

More Telugu News