‘‘అమెరికా ఉద్యోగం నాకు నేర్పిన ఐదు పాఠాలు’’.. భారతీయుడి పోస్ట్ వైరల్
- అమెరికా అనుభవాలు పంచుకున్న భారతీయుడు
- లింక్డిన్‌లో వైరల్‌గా మారిన పోస్టు
- సమయపాలనకు అధిక ప్రాధాన్యమిస్తారని వెల్లడి
- ముందస్తు సన్నద్ధతపై దృష్టి పెడతారని చెప్పిన ఇండియన్
- బాధ్యతల స్పష్టమైన విభజన ఉంటుందని వ్యాఖ్య
- సూచనలు ఇచ్చే ప్రత్యేక విధానం ఉందని వెల్లడి
- భారత్‌లో బలాలనూ గుర్తుచేసిన యువకుడు
విదేశాలకు వెళ్లిన చాలా మంది అక్కడి ఉద్యోగ విధానం గురించి చెబుతుంటారు. కానీ ఓ భారతీయుడు చెప్పిన ఐదు విషయాలు మాత్రం వేల మందిని ఆలోచింపజేస్తున్నాయి. ‘‘అమెరికా నాకు ఇవే నేర్పింది’’ అంటూ లింక్డిన్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన అనుష్క్ ఎస్ అనే భారతీయుడు అక్కడి ఉద్యోగ సంస్కృతి తన ఆలోచనా విధానాన్నే మార్చిందని చెప్పాడు. భారత్‌లో నేర్చుకున్న పని తీరు, అమెరికాలో చూసిన విధానం మధ్య చాలా తేడా కనిపించిందని పేర్కొన్నాడు.
అమెరికాలో పనిచేసిన అనుభవం తర్వాత ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు ఉన్నాయని వివరించాడు. వాటిలో మొదటిది సమయానికి విలువ ఇవ్వడం. అక్కడ సమయపాలనను కేవలం మంచి అలవాటుగా కాకుండా, వృత్తి నిబద్ధతగా చూస్తారని తెలిపాడు. సమావేశాలు నిర్ణయించిన సమయానికే మొదలవుతాయని, గడువులకు అక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంటుందని చెప్పాడు. ఇలాంటి క్రమశిక్షణే నమ్మకానికి పునాది అవుతుందని అభిప్రాయపడ్డాడు.
రెండో విషయం ముందస్తు సన్నద్ధత. ‘‘చూద్దాం... తర్వాత చూసుకుందాం’’ అనే ధోరణికి అక్కడ పెద్దగా చోటు ఉండదని చెప్పాడు. సమావేశానికి వెళ్లే ముందు విషయంపై పూర్తి అవగాహన ఉండాలని, ఎదురయ్యే ప్రశ్నలు, సమస్యలను ముందే ఊహించి సిద్ధంగా ఉండాలని వివరించాడు.
మూడో అలవాటు బాధ్యతలను స్పష్టంగా పంచడం అని చెప్పాడు. ఏ పని ఎవరు చేయాలి? నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఫలితానికి ఎవరు జవాబుదారీ అన్నది ముందే ఖరారై ఉంటుందని తెలిపాడు.
నాలుగో అంశం సూచనలు ఇచ్చే విధానం. తప్పులను ఎత్తిచూపి అవమానపరచడం కాదని, పని మెరుగుపడేలా వ్యక్తిగతంగా, స్పష్టంగా సూచనలు ఇస్తారని పేర్కొన్నాడు.
అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే పని మొదలుపెట్టడం ఐదో అలవాటు అని వివరించాడు. ప్రతి చిన్న విషయం ఖరారయ్యే వరకు ఎదురుచూడకుండా, మంచి ఆలోచన ఉంటే వెంటనే అమలు మొదలుపెడతారని చెప్పాడు. పని చేస్తూ ప్రణాళికను అవసరానికి తగ్గట్టు మార్చుకుంటారని వెల్లడించాడు.
అయితే భారత్ కూడా తనకు ఎంతో నేర్పిందని అనుష్క్ చెప్పాడు. తక్కువ వనరులతో అవకాశాలు సృష్టించడం, పరిస్థితులకు తగ్గట్టు మారడం, ఒత్తిడిని తట్టుకోవడం వంటి లక్షణాలు భారత్ నుంచి నేర్చుకున్నానని తెలిపాడు. ఈ లక్షణాలకు అమెరికాలో నేర్చుకున్న పని సంస్కృతికి తోడైతే మరింత మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డాడు. ఆయన పోస్ట్ లింక్డిన్‌లో వైరల్‌గా మారింది.