అమెరికాలో గడ్డి కోసే పని.. ఏడాదికి రూ.15 లక్షల జీతం, ఆడి కారు!

Lawn mowing job in USA 15 lakh salary and Audi car
  • అమెరికాలో గడ్డి కత్తిరించే పనికి లక్షల్లో జీతం
  • ఏడాదికి రూ.10-15 లక్షలు సంపాదిస్తున్నారన్న ఇన్ఫ్లుయెన్సర్
  • గడ్డి కోసే వ్యక్తి ఆడి కారులో తిరుగుతున్నాడంటూ వీడియో
  • ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు
ఓ భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ అమెరికాలోని ఓ సాధారణ ఉద్యోగం గురించి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ, తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికాలో గడ్డి కోసే (లాన్ మోయింగ్) పని చేసే వ్యక్తికి ఏడాదికి లక్షల్లో జీతం వస్తుందని, అతడు ఆడి కారులో తిరుగుతున్నాడని సదరు ఇన్ఫ్లుయెన్సర్ వెల్లడించాడు. 

రాజస్థాన్‌కు చెందిన ఇష్వర్ యాదవ్ (@ishuyadav_rj02) అనే కంటెంట్ క్రియేటర్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. ఇటీవల అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో, అమెరికాలో గడ్డి కోసే పని చేసే ఒక వ్యక్తి ఏకంగా ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఆ వ్యక్తి ఆడి కారును వాడుతున్నాడని, రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ కారును చూపిస్తూ వివరించాడు. అమెరికాలో ఏ పనీ చిన్నది కాదని, శ్రమకు తగిన గౌరవం, మంచి జీతం లభిస్తాయని ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు.

ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఈ వీడియో చూసి స్ఫూర్తి పొందామని, తాము కూడా అమెరికా వెళ్లాలని ఉందని కామెంట్లు చేశారు. అయితే, మరికొందరు భిన్నంగా స్పందించారు. అమెరికాకు వెళ్లడానికి, అక్కడ స్థిరపడటానికి అయ్యే ఖర్చులు చాలా ఎక్కువని, జీవన వ్యయం కూడా అధికంగా ఉంటుందని గుర్తుచేశారు. అమెరికాలో అందరూ అలా సంపాదించరని, అక్కడ కూడా పేదరికం ఉందని కొందరు వాస్తవ పరిస్థితిని వివరించారు.

Go Back to Shorts
Ishwar Yadav
USA lawn mowing salary
Indian influencer viral video
Audi car lawn mower USA
USA job opportunities for Indians
Cost of living in USA

More Telugu News