- పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీని పుస్తకంగా ప్రచురించిన సన్నిహితుడు
- మూడుసార్లు దుష్టశక్తుల ప్రత్యక్ష దాడులు ఎదుర్కొన్నట్లు వెల్లడి
- నిప్పులు చెరిగే కళ్లతో దెయ్యం కనిపించి మాట్లాడిందన్న పోప్
- ఇతరులకు హాని జరగకుండా ప్రాణాలు తీయాలని దేవుడికి వేడుకోలు
- చిలీ చర్చి లైంగిక వేధింపుల కేసులో అంతర్మథనం ప్రస్తావన
కోట్లాది మంది క్రైస్తవులకు దైవ ప్రతినిధిగా కనిపించిన పోప్ ఫ్రాన్సిస్ జీవితంలో నమ్మలేని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన స్వయంగా రాసుకున్న వ్యక్తిగత డైరీ ద్వారా దెయ్యాలు, నరకం తాలూకు భయానక దృశ్యాలు ఆయనను ఎలా వెంటాడాయో బయటపడింది. పోప్ అత్యంత సన్నిహితుడైన కార్డినల్ విక్టర్ మాన్యువల్ ఫెర్నాండెజ్ ఈ 160 పేజీల డైరీని ‘ది ప్రైవేట్ డైరీ ఆఫ్ పోప్ ఫ్రాన్సిస్’ పేరిట పుస్తక రూపంలో ప్రచురించారు. అధికార వినియోగంలో ఎదురైన ప్రలోభాలు, అంతర్గత సంఘర్షణలతో తాను తీవ్రమైన మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు ఫ్రాన్సిస్ అందులో అంగీకరించారు. "ఇతరులకు హాని కలగకుండా దేవుడే నా ప్రాణాలు తీసుకుంటే బాగుండు" అని వేడుకున్నట్లు కూడా రాసుకున్నారు.
ఈ డైరీలోని అత్యంత కలవరపెట్టే అంశం దెయ్యాల దాడులే. తన జీవితంలో మూడుసార్లు దుష్టశక్తుల ప్రత్యక్ష దాడులు ఎదురయ్యాయని ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. బ్యూనస్ ఎయిర్స్లో ఆర్చ్ బిషప్గా ఉన్నప్పుడు రెండుసార్లు, పోప్గా బాధ్యతలు చేపట్టాక మరోసారి ఈ అనుభవం ఎదురైంది. నిప్పులు చెరిగే కళ్లతో, భయానకంగా, ఆకర్షణీయంగా కనిపించిన ఆ దుష్టశక్తిని వర్ణిస్తూ.. 2021 జనవరి 24న ఒక భయానక ఘట్టాన్ని రాశారు. రోమ్కు తిరిగొచ్చిన కొన్ని రోజులకే ఓ సమావేశంలో ఉన్నప్పుడు ఆ దుష్టరూపం ఎదురైందని, "నాకు కావాల్సిందంతా ఇప్పుడు దక్కించుకున్నా" అంటూ విజయగర్వంతో వినిపించిన స్వరాన్ని తాను విన్నట్లు డైరీలో నమోదు చేశారు. ఆ తర్వాత అనారోగ్యంతో రెండేళ్లపాటు భావోద్వేగ చీకట్లోకి వెళ్లిపోయానని, చివరకు 2024లో వర్జిన్ మేరీని రక్షించమని వేడుకున్నట్లు ప్రస్తావించారు.
ఆధ్యాత్మిక వేదనలతో పాటు క్యాథలిక్ చర్చిని కుదిపేసిన లైంగిక వేధింపుల వ్యవహారంపై కూడా పోప్ ఫ్రాన్సిస్ తన అంతర్మథనాన్ని డైరీలో రాసుకున్నారు. చిలీకి చెందిన బిషప్ లైంగిక వేధింపుల కేసును తొలుత తోసిపుచ్చినందుకు ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన తప్పును గ్రహించి రోమ్కు పిలిపించగా, బిషప్లంతా ఒకేసారి రాజీనామాలు పంపడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. "చిలీ పరిస్థితి చూసి నా కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. అక్కడ అంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేదు" అని 2018 నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. అమెరికా ఖండం నుంచి వచ్చిన తొలి జెసూట్ పోప్గా చరిత్రకెక్కిన ఫ్రాన్సిస్, 2025 ఏప్రిల్ 21న తన 88వ ఏట తుదిశ్వాస విడిచారు.