- సినిమాల్లో చూపించే కండలు తిరిగిన హీరోలు నిజ జీవితంలో ఉండరన్న ఆర్జీవీ
- సిక్స్ ప్యాక్ ఉన్నవాళ్లు, అది లేని వారి దగ్గర పనిచేస్తారని వ్యాఖ్య
- నెపోలియన్, స్టాలిన్, మాఫియా డాన్ల ఉదాహరణలతో తన వాదనను సమర్థించిన వైనం
- రాజకీయ నాయకులు, సైనిక జనరల్స్‌ను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుందన్న వర్మ
- సినిమాల్లో సిక్స్ ప్యాక్ అనేది శక్తికి చిహ్నం కాదు, కేవలం అలంకారం మాత్రమేనని వెల్లడి
సినిమాల్లో కండలు తిరిగిన దేహంతో, సిక్స్ ప్యాక్‌తో కనిపించే హీరోలకు, నిజ జీవితంలో అధికారం చెలాయించే శక్తిమంతులకు ఏమాత్రం సంబంధం ఉండదని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి, అది లేని వ్యక్తి కింద పనిచేయడమే నిజ జీవితంలో కనిపించే వాస్తవమని తన 'ఎక్స్' ఖాతాలో ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్ చేశారు.
"ది ఐరనీ ఆఫ్ టఫ్ హీరోస్ హైడింగ్ బిహైండ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్" అనే లైన్‌తో వర్మ ఈ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "బాహుబలి ముందు నుంచి లేదా ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఒక నిజాన్ని విస్మరించారు. సినిమాల్లో కనిపించే కండలు తిరిగిన హీరోల్లా నిజ జీవితంలోని శక్తిమంతులు ఎవరూ ఉండరు. నిజానికి కండలున్న సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నవారు తరచుగా పొట్టిగా, సన్నగా, లావుగా లేదా పొట్ట ఉన్న వ్యక్తుల కింద పనిచేస్తుంటారు" అని వర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
సినిమాల్లో సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తినే అత్యంత బలవంతుడిగా చూపిస్తారని, కానీ నిజ జీవితంలో అలాంటి వ్యక్తి, జిమ్ మొహం చూడని పొట్టి, బట్టతల ఉన్న వ్యక్తి వెనుక నిలబడి ఉంటాడని వర్మ వివరించారు. ఆ సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి జీవించడానికి అవసరమైన జీతాన్ని ఇచ్చేది కూడా ఆ సాధారణ వ్యక్తియేనని పేర్కొన్నారు.
తన వాదనకు బలం చేకూర్చుతూ చారిత్రక ఉదాహరణలను ప్రస్తావించారు. "చక్రవర్తి నెపోలియన్ 5 అడుగుల 6 అంగుళాలు మాత్రమే ఉండి, ఒక గుమాస్తాలా కనిపించేవాడు. కానీ, యూరప్‌లోని బలవంతులంతా ఆయన కింద పనిచేసేవారు. కేవలం 5 అడుగుల 4 అంగుళాలున్న స్టాలిన్ ఒక బంగాళాదుంపలా కనిపించినా, ఆయన ఆదేశాలను అమలు చేసే సైనికాధికారులు మాత్రం ఫిట్‌గా ఉండేవారు. కానీ, వారిని క్షణాల్లో కాల్చి చంపగల అధికారం స్టాలిన్‌ది" అని తెలిపారు.
అల్ కపోన్ నుంచి పాబ్లో ఎస్కోబార్, దావూద్ ఇబ్రహీం వరకు ఏ మాఫియా డాన్ కూడా కండలు తిరిగిన శరీర సౌష్టవంతో లేరని వర్మ గుర్తుచేశారు. వారి కోసం హత్యలు చేసే కింది స్థాయి వ్యక్తులే శారీరకంగా బలంగా ఉంటారని, వారికి తక్కువ జీతం ఇచ్చి సులభంగా వదిలించుకుంటారని అన్నారు.
భారత రాజకీయాల్లోనూ ఇదే కనిపిస్తుందని, ఫోన్ కంటే బరువైన వస్తువును ఎత్తని నాయకుల చుట్టూ ఆరడుగుల బాడీగార్డులు బానిసల్లా కాపలా కాస్తుంటారని వ్యాఖ్యానించారు. సైన్యంలోనూ సైతం పొట్ట ఉన్న జనరల్స్, ఫిట్‌గా ఉండే సైనికులను యుద్ధంలోకి పంపిస్తారని, వారేమో బుల్లెట్ల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని వర్మ విశ్లేషించారు.
"కాబట్టి, సినిమాల్లో సిక్స్ ప్యాక్ అనేది శక్తికి చిహ్నం కాదు, అదొక అలంకారం మాత్రమే. నిజ జీవితంలో సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి ఎప్పుడూ దాని గురించి పట్టించుకోని వ్యక్తి కిందే పనిచేస్తాడు!" అంటూ వర్మ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.