- దీర్ఘకాలిక నైట్ షిఫ్టులతో గుండె నిర్మాణంలో మార్పులు
- 42 వేల మందిపై విస్తృత అధ్యయనం చేసిన పరిశోధకులు
- రాత్రిళ్లు మేల్కొనడం వల్ల దెబ్బతింటున్న జీవ గడియారం
- బీపీ షుగర్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వచ్చే ప్రమాదం
- క్రమం తప్పకుండా వ్యాయామం, నిద్ర అవసరమన్న నిపుణులు
ఐటీ, పరిశ్రమలు, అత్యవసర సేవలు వంటి విభాగాల్లో పనిచేస్తూ నిరంతరం నైట్ షిఫ్టులు చేసేవారి గుండె పనితీరు, నిర్మాణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలం పాటు రాత్రి వేళల్లోనే విధులు నిర్వర్తించే వారి గుండె కండరాల గోడలు కొంత మందంగా మారడంతో పాటు, గుండె లోపలి గదుల (ఛాంబర్స్) పరిమాణం కాస్త తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు దాదాపు 42,671 మందికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. వీరిలో క్రమం తప్పకుండా నైట్ షిఫ్టులు చేసే 1,322 మందిని ప్రత్యేకంగా పరిశీలించారు. వీరి సగటు వయసు 52 సంవత్సరాలు. నిరంతరం రాత్రి వేళల్లో పనిచేసే వారి గుండె నిర్మాణంలో స్వల్ప మార్పులు కనిపించినప్పటికీ, గుండె రక్తాన్ని పంప్ చేసే ప్రధాన సామర్థ్యంలో మాత్రం ఎలాంటి పెద్ద తేడా కనిపించలేదని పరిశోధకులు స్పష్టం చేశారు.
రాత్రి వేళల్లో మేల్కొని పనిచేయడం వల్ల మానవ శరీర సహజ జీవ గడియారం (బాడీ క్లాక్) పూర్తిగా అస్తవ్యస్తమవుతుందని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులు రావడం, శరీరంలో కొవ్వుల సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితులు దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే, వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే రాత్రి డ్యూటీ చేసేవారిలో ఇలాంటి తీవ్ర ప్రభావాలు కనిపించలేదని, ఏళ్ల తరబడి నిరంతరాయంగా నైట్ షిఫ్ట్‌లు చేసేవారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా నమోదైనట్లు అధ్యయనం పేర్కొంది.
నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు:
- ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
- పగటి వేళల్లో అయినా కనీసం 7 నుంచి 9 గంటల పాటు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.
- రాత్రి వేళల్లో వేపుళ్లు, జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.
- రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్ణీత వ్యవధిలో చెక్ చేసుకోవాలి.
- వైద్యుల సలహాతో సమయానుకూలంగా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
ఈ అధ్యయనం నైట్ షిఫ్ట్ చేసే ప్రతి ఒక్కరికీ గుండె జబ్బులు వస్తాయని నిర్ధారించడం లేదని నిపుణులు స్పష్టం చేశారు. ఇది కేవలం రాత్రి షిఫ్ట్‌ల ప్రభావం వల్ల గుండె నిర్మాణంలో వచ్చే మార్పుల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే సూచిస్తోందని, నిరంతరం రాత్రి డ్యూటీలు చేసేవారు తమ ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పరిశోధకులు వెల్లడించారు.