- తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల రాత పరీక్షకు ఏర్పాట్లు
- రేపటి నుంచి 28 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
- హాల్‌టికెట్‌పై తప్పనిసరిగా పాస్‌పోర్టు సైజ్ ఫొటో ఉండాలన్న టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ
తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఈ నెల 29న నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ నెల 22వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgprb.in ద్వారా ఈ నెల 28వ తేదీ వరకు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే support@tslprb.inకు ఈ-మెయిల్ చేయడం ద్వారా లేదా 040-41895151 ఫోన్ నంబర్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చని వివరించారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌పై తమ పాస్‌పోర్టు సైజు ఫొటోను తప్పనిసరిగా అతికించాలని ఛైర్మన్ స్పష్టం చేశారు. గతంలో ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఉపయోగించిన ఫొటోనే వాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫొటో లేకుండా పరీక్ష కేంద్రానికి వచ్చే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష రాసేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పారు.